China investments in India : భారత్లో చైనా పెట్టుబడులను పెంచేందుకు ప్రణాళికలు
భారతదేశంలో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భద్రతాపరమైన ముప్పు వాటిల్లకుండా పనిచేసే కంపెనీలకు సంబంధించి ఓ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తైన వెంటనే ఆయా సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మరోవైపు ప్రెస్ నోట్- 3 ప్రకారం అదనపు పరిశీలన లేకుండా ఈ రంగాల్లో పెట్టుబడులను కేంద్ర అనుమతించే అవకాశం ఉంది.
చైనా నుంచి ముప్పు ఉంది
ముఖ్యంగా 2020లో భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం మొదలైనప్పటి నుంచి ప్రెస్ నోట్ - 3 అమల్లో ఉంది. ఈ రూల్ ప్రకారం భూ సరిహద్దుల్లో ఉన్న వారు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ అనుమతిని కచ్చితంగా పొందాలి. చైనా నుంచి ముప్పు ఉందని అది ఇంకా తొలిగిపోలేదని అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. భద్రతాపరమైన ముప్పు కలిగించని కంపెనీలు లిస్ట్ తయారు చేస్తే ఆటోమెటిక్ చైనా ఇన్‌వెస్ట్‌మెంట్స్‌కి అనుమతులు లభించవచ్చు. ఇక చైనా పెట్టుబడులు రాకపోవడం వల్ల దేశ సొంత తయారీ రంగంపై ప్రభావం పడుతుందని పలు కంపెనీలు చెబుతున్నాయి.
మేకిన్ ఇండియాతో దేశీయ పరిశ్రమలు దెబ్బతినే అవకాశం
మరోవైపు 'మేకిన్ ఇండియా' కు చైనా కంపెనీలు అనుమతించడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు పేర్కన్నారు. చైనా సంస్థలపై ఆధారపడడం వల్ల భౌగోళిక ప్రమాదాలకు భారత్ గురవుతుందని గ్లోబల్ ట్రేడ్ రసెర్చ్ ఇనీషియేటివ్ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు.