Page Loader
China tarrif: 'త‌గ్గేదేలే' అంటున్న చైనా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంపు 
అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంచిన చైనా

China tarrif: 'త‌గ్గేదేలే' అంటున్న చైనా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2025
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికా,ఆసియా మహాశక్తి చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ చైనాపై కఠిన వ్యాఖ్యలు చేస్తూ, ఆ దేశ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తున్నారు. అయితే, ట్రంప్ బెదిరింపులపై చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకాన్ని 145 శాతం వరకూ పెంచగా, దానికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను 125 శాతం పెంచింది. ఈ చర్యల వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంచిన చైనా

వివరాలు 

ట్రంప్ టారిఫ్ చర్యలపై జిన్‌పింగ్ తొలిసారి స్పందన 

అమెరికా తీసుకుంటున్న ఆర్థిక చర్యలపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మొదటిసారి తన స్పందన తెలియజేశారు. డ్రాగన్ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ 'జిన్హువా'ఈ విషయాన్ని ప్రకటించింది. అమెరికా విధించిన 145శాతం టారిఫ్‌లను జిన్‌పింగ్ ఏకపక్ష బెదిరింపుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో,అమెరికా ఆర్ధిక ఒత్తిడికి ఎదురొడ్డి నిలబడేందుకు ఐరోపా యూనియన్‌తో చైనా చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా,యూరప్ దేశాలు అంతర్జాతీయ స్థాయిలో తమ తమ బాధ్యతలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని,అదే సమయంలో తమ చట్టబద్ధమైన హక్కులను,జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవచ్చని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు,అంతర్జాతీయ వ్యవహారాలలో పారదర్శకతను,న్యాయాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బీజింగ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో జరిగిన సమావేశం సందర్భంగా జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.