Page Loader
సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు 
సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు

సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు 

వ్రాసిన వారు Stalin
Apr 19, 2023
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా మిలిటరీ ధ్వని కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఎత్తైన గూఢచారి డ్రోన్‌ను త్వరలో మోహరించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం రాసుకొచ్చింది. అయితే ఇటీలవ లీకైన యుఎస్ మిలిటరీ పత్రాలు ఆధారంగా వాషింగ్టన్ పోస్ట్ ఈ నివేదికను రూపొందించడం గమనార్హం. నేషనల్ జియో స్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి వచ్చిన రహస్య పత్రాన్ని ఈ సందర్భంగా వాషింగ్టన్ పోస్ట్ ఉదహరించింది. గతేడాది ఆగస్టు 9నాటి ఉపగ్రహ చిత్రాల ఆధారంగా షాంఘై నుంచి 560 కిమీ దూరంలో తూర్పు చైనాలోని వైమానిక స్థావరం వద్ద రెండు డబ్ల్యూ-8 రాకెట్-చోదక నిఘా డ్రోన్‌లను గుర్తించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని చెప్పింది.

చైనా

ఈస్టర్న్ థియేటర్ కమాండ్ పరిధిలో సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ 

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తన మొదటి సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను బేస్ వద్ద ఏర్పాటు చేసినట్లు అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి. తైవాన్‌పై తన సార్వభౌమాధికారాన్ని చాటుకునేందుకు చైనా సైన్యం ఏర్పాటు చేసిన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ పరిధిలోకి ఈ బేస్ వస్తుందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అయితే వాషింగ్టన్ పోస్ట్ రాసిన నివేదికపై అమెరికా రక్షణ శాఖ స్పందించలేదు. అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక పత్రాలు, యుద్ధ రహస్యాలను లీక్ చేసిన మసాచుసెట్స్ ఎయిర్ నేషనల్ గార్డ్ సభ్యుడు జాక్ డగ్లస్ టీక్సీరాను గురువారం ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది.