
US-China: 'మేం ఎప్పటికీ మోకరిల్లం'.. అమెరికా టారిఫ్‌లను ఉద్దేశిస్తూ వీడియో విడుదల చేసిన చైనా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అగ్రశక్తులుగా గుర్తింపొందిన అమెరికా, చైనాల మధ్య పరస్పర సుంకాల విధానాల నేపథ్యంలో తీవ్ర వాణిజ్య యుద్ధం చెలరేగింది.
టారిఫ్‌ల విషయంలో రెండు దేశాలు కూడా తమ వైఖరిని మార్చేందుకు ఇష్టపడకపోవడం ఈ ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికా విధిస్తున్న సుంకాలకు చైనా వణికిపోయిందన్న మాటలు నిజం కాదని స్పష్టం చేస్తూ, బీజింగ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది.
ఈ వీడియోను చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా షేర్ చేసింది.
అందులో 'అమెరికా ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ అనే తుపాను సృష్టించిందని, ఉద్దేశపూర్వకంగా చైనాను లక్ష్యంగా చేసుకుంటోందని పేర్కొంది.
వివరాలు
ఇతర దేశాలతో "90 రోజుల విరామం" అనే ఆట
అమెరికా ఇతర దేశాలతో "90 రోజుల విరామం" అనే ఆట ఆడుతుంటే, చైనా వాణిజ్యాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నాల్లో ఉందని విమర్శించింది.
వేధింపులకు తలవంచడం అంటే — గొంతు తడిపేందుకు విషం తాగడమేనని, అలాంటి పరిస్థితి వాణిజ్య సంక్షోభాన్ని మరింత తీవ్రమవుతుంది అని హితవు పలికింది.
ఈ వీడియోలో అమెరికా గత ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించాయి.
ఓ కాలంలో జపాన్ భారీగా సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుందనే నెపంతో,అమెరికా జపాన్ కంపెనీలపై,ముఖ్యంగా తోషిబాపై ఒత్తిడి తెచ్చిందని వీడియో పేర్కొంది.
పైగా,ప్లాజ్మా ఒప్పందంపై సంతకాలు చేయాల్సిందిగా జపాన్‌ను బలవంతంగా ఒప్పించింది.
దీని ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందని తెలిపింది.
వివరాలు
రాజీ పడిన వారికి న్యాయం లభించదు
ఇదే తరహాలో అమెరికా తన న్యాయశాఖను ఉపయోగించి, ఫ్రాన్స్‌కు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీలపై చర్యలు తీసుకొని వాటిని దోచుకుందన్న ఆరోపణలు వీడియోలో ఉన్నాయి.
ఇటువంటి చరిత్రలో ఒక అంశం స్పష్టమని వీడియో పేర్కొంది. రాజీ పడిన వారికి న్యాయం లభించదు. మోకరిల్లిన వారిని మరింతగా బెదిరించడం జరుగుతుందని, చైనా ఎప్పటికీ మోకరించదని స్పష్టం చేసింది.
చైనా వెనక్కి తగ్గదని, బలహీనులు మాత్రమే దిగజారిన గళాలతో వినిపిస్తారని వ్యాఖ్యానించింది.
అంతేకాదు, ప్రపంచ దేశాలన్నీ ఒక్కటిగా నిలిస్తే, అమెరికా కేవలం ఓ చిన్న పడవ మాత్రమేగా మిగిలిపోతుందన్న ఉద్ఘాటన చేసింది.
అమెరికా టారిఫ్‌ల ప్రకటన అనంతరం చైనా తరచూ ఇలాంటి వీడియోల ద్వారా తన స్పందన తెలియజేస్తోంది.
వివరాలు
బీజింగ్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 145 శాతం
అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ట్రంప్ అధ్యక్ష పాలనలో చైనాపై విధించిన టారిఫ్‌లు మరింత పెరిగాయి.
బీజింగ్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం 145 శాతం వరకు సుంకాలను పెంచింది.
దీనికి ప్రతిగా, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది. దీంతో వాణిజ్య రంగంలో రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్రంగా తారాస్థాయికి చేరాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చైనా విడుదల చేసిన వీడియో ఇదే..
Never Kneel Down! pic.twitter.com/z8FU3rMSBA
— CHINA MFA Spokesperson 中国外交部发言人 (@MFA_China) April 29, 2025