Page Loader
చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ 3వ సారి ఎన్నిక- పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం
చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ 3వ సారి ఎన్నిక- పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం

చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ 3వ సారి ఎన్నిక- పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం

వ్రాసిన వారు Stalin
Mar 10, 2023
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

షీ జిన్‌పింగ్ శుక్రవారం చైనా అధ్యక్షుడిగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిన్‌పింగ్‌ను చైనా అధ్యక్షుడిగా కొనసాగించేందుకు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ దేశ దిగ్గజ నాయకుడు దివంగత మావో జెడాంగ్ తర్వాత దేశంలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా, శక్తిమవంతమైన నేతగా ఆయన కొనసాగనున్నారు. 2012నుంచి చైనాకు జిన్‌పింగ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. వాస్తవానికి చైనా రాజ్యాంగం ప్రకారం ఒకరు రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవిలో ఉండాలి. అయితే రాజ్యాంగ సవరణ చేసి.. మూడోసారి అధ్యక్షుడయ్యే మార్గాన్ని సుగమం చేసున్నారు జిన్‌పింగ్‌.

చైనా

చైనా అధ్యక్షుడిగా జీవిత కాలం కొనసాగే యోచనలో జిన్‌పింగ్‌

వాస్తవానికి చైనా అధ్యక్ష పదవి విరమణ వయసు 68ఏళ్లు. అయితే ప్రస్తుతం జిన్‌పింగ్‌ వయస్సు 69. పదవి విరమణ వయసు అంశంలో కూడా రాజ్యాంగ సవరణ చేయడంతో మరోసారి జిన్‌పింగ్‌‌కు అవకాశం వచ్చింది. జిన్‌పింగ్‌‌.. చైనా అధ్యక్షుడిగా జీవిత కాలం కొనసాగాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఇందుకోసం తనకు పోటీగా వస్తారనుకున్న నేతలను కీలక కమిటీల నుంచి ఇప్పటికే తొలగించారు. స్టాండింగ్ కమిటీ, పోలిట్ బ్యూరో కమిటీల నుంచి సీనియర్ నేతలకు జిన్‌పింగ్‌ ఉద్వాసన పలికారు.