
China: భారతీయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధం.. చైనా రాయబారి జు ఫీహాంగ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించబోయే సుంకాల భయంతో చైనా (China) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలనే యోచనలో ఉంది.
చైనాలోని భారత రాయబారి జు ఫీహాంగ్ (Ju Feehang) ఓ వార్తా కథనంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
"వాణిజ్యం సహా ఇతర రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చైనా మార్కెట్‌కు అనుకూలంగా ఉండే మరిన్ని భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిస్తున్నాం," అని ఆయన పేర్కొన్నారు.
ఇది వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరచేందుకు దోహదపడుతుందని వివరించారు.
వివరాలు
సుంకాల విధింపుపై అధికారిక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై పరస్పర సుంకాలను విధించనున్న నేపథ్యంలో చైనా రాయబారి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయం రెండు ప్రత్యర్థి దేశాలను స్నేహితులుగా మారుస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే, డొనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో సుంకాల విధింపుపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
ఇటీవల ఆయన మాట్లాడుతూ అన్ని దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తామని ప్రకటించారు.
అయితే, కొన్ని దేశాలను ఈ సుంకాల నుంచి మినహాయించే అవకాశముందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.