LOADING...
'Chocolate heist':  యూరప్‌లో భారీ చాక్లెట్ దొంగతనం.. 4 లక్షల కిట్‌కాట్ బార్లు మాయం!
యూరప్‌లో భారీ చాక్లెట్ దొంగతనం.. 4 లక్షల కిట్‌కాట్ బార్లు మాయం!

'Chocolate heist':  యూరప్‌లో భారీ చాక్లెట్ దొంగతనం.. 4 లక్షల కిట్‌కాట్ బార్లు మాయం!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

యూరప్‌లో భారీ స్థాయిలో చాక్లెట్ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కంపెనీ నెస్లేకు చెందిన కిట్‌కాట్ చాక్లెట్ బార్లు పెద్ద సంఖ్యలో మాయం కావడంతో సంచలనం రేగింది. ఈ ఘటన ఈస్టర్ పండుగ ముందు చోటుచేసుకోవడంతో సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ వివరాల ప్రకారం, దాదాపు 12టన్నుల బరువున్న 4,13,793కిట్‌కాట్ చాక్లెట్ బార్లను తరలిస్తున్న ట్రక్ మార్గమధ్యలో దొంగిలించబడింది. ఈఘటన గత వారం యూరప్‌లోని ఉత్పత్తి కేంద్రం నుంచి పంపిణీ కేంద్రానికి వెళ్తున్న సమయంలో జరిగింది. ఈ ట్రక్ ఇటలీ నుంచి బయలుదేరి పోలాండ్‌కు వెళ్తుండగా అదృశ్యమైందని కంపెనీ వెల్లడించింది. ట్రక్‌తో పాటు చాక్లెట్ సరుకు ఇప్పటికీ కనుగొనలేదని తెలిపింది.ఈ కేసులో స్థానిక అధికారులు, సరఫరా భాగస్వాములతో కలిసి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.

వివరాలు 

ఈస్టర్ ముందు మార్కెట్లో కిట్‌కాట్ చాక్లెట్ల కొరత

"కిట్‌కాట్‌తో బ్రేక్ తీసుకోండి అని మేము చెబుతుంటాం. కానీ దొంగలు ఆ మాటను నిజం అనుకోని తీసుకుని 12 టన్నుల చాక్లెట్‌తో పారిపోయారు" అంటూ కంపెనీ ప్రతినిధి సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఘటన కారణంగా ఈస్టర్ ముందు మార్కెట్లో కిట్‌కాట్ చాక్లెట్ల కొరత ఏర్పడే అవకాశముందని కంపెనీ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ దొంగిలించిన చాక్లెట్లు యూరప్ మార్కెట్లలో అనధికార మార్గాల్లో విక్రయానికి రావచ్చని తెలిపింది. ప్రతి కిట్‌కాట్ బార్‌పై ఉన్న ప్రత్యేక ట్రాకింగ్ కోడ్‌ల ద్వారా ఈ చాక్లెట్లను గుర్తించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

వివరాలు 

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా కథలా..

ఏదైనా సరిపోలిక కనుగొనబడితే వెంటనే కంపెనీకి సమాచారం అందేలా వ్యవస్థ ఉందని వెల్లడించింది. అయితే వినియోగదారుల భద్రతపై ఎలాంటి ప్రమాదం లేదని కంపెనీ స్పష్టం చేసింది. సరఫరాపై కూడా పెద్దగా ప్రభావం లేదని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై సరదాగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. "ఇది కొత్త ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా కథలా ఉంది" అంటూ ఒకరు కామెంట్ చేయగా, "GTA VI కంటే ముందే కిట్‌కాట్ హైస్ట్ వచ్చేసింది" అంటూ మరొకరు స్పందించారు.

Advertisement