LOADING...
Narendra Modi: భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది.. ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని మోదీ 
భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది..

Narendra Modi: భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది.. ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, కేవలం ప్రపంచ దేశాలు మన వృద్ధిని గమనించడమే కాకుండా, మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోదీ జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆ దేశంలోని టోక్యోలో నిర్వహించిన ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో ఆయన ప్రసంగించారు. "ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ స్థిరత్వం,ఆర్థిక స్థిరత్వం,అలాగే పారదర్శక విధానాలు ఉన్నందున, మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది"అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడులు కేవలం పెరుగుతుండడమే కాకుండా, వాటి విలువలు రెట్టింపు అవుతున్నట్లు ఆయన వివరించారు.

వివరాలు 

ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి ఇరు దేశాలు నాయకత్వం వహించవచ్చు: మోదీ 

భారత్,జపాన్ మధ్య భాగస్వామ్యం కేవలం వ్యూహాత్మక సంబంధమే కాక,అది ఒక స్మార్ట్,పరస్పర నమ్మకాలపై ఆధారపడిన బంధమని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ రెండు దేశాల కలయిక ఆసియా శతాబ్దంలో స్థిరత్వం,వృద్ధి,శ్రేయస్సుకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. సాంకేతిక రంగంలో భారత్,జపాన్ కలిసి పనిచేసే అవకాశాలపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఏఐ, సెమీకండక్టర్లు,క్వాంటం కంప్యూటింగ్,బయోటెక్,అంతరిక్ష పరిశ్రమలలో భారత్ నమ్మకమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను చేపట్టింది.జపాన్ సాంకేతికత,భారత ప్రతిభావంతుల మేధస్సు కలిసినపుడు,ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి ఇరు దేశాలు నాయకత్వం వహించవచ్చు"అని మోదీ తెలిపారు. ఈ రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలు సమగ్ర శ్రేయస్సుగా మారుతాయి. అలాగే, జపాన్ వ్యాపారాలు భారతదేశాన్ని అభివృద్ధి, పెట్టుబడి, సాంకేతికత కోసం ఒక సమర్థవంతమైన వేదికగా ఉపయోగించగలవని ఆయన పేర్కొన్నారు.