US Presidential Elections 2024: అమెరికాలో మొదలైన ఓట్ల కౌంటింగ్.. 9 రాష్ట్రాలలో ట్రంప్..5 రాష్ట్రాలలో కమలా విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి ట్రంప్ 9 రాష్ట్రాల్లో విజయం సాధించి, 95 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 5 రాష్ట్రాల్లో గెలిచి, 35 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు. అధ్యక్ష పదవిని చేపట్టాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లను సాధించాల్సి ఉంటుంది.
స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ప్రభంజనం
స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, సౌత్ కరోలినా, ఫ్లోరిడాల్లో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు . జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ పోటీకి మించిన ప్రాబల్యం చూపడం లేదు. జార్జియాలో ట్రంప్‌కి 62.5% ఓట్లతో 6,51,177 ఓట్లు నమోదయ్యాయి, ఇక కమలా హ్యారిస్‌కి 37.0% ఓట్లతో 3,85,216 ఓట్లు వచ్చాయి. లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫ్లోరిడాలో కూడా ఇలాంటి స్థితి కనిపిస్తోంది, ఇక్కడ ట్రంప్‌కి 54.8% ఓట్లతో 49,47,232 ఓట్లు పోలయ్యాయి. కమలా హ్యారిస్‌కి 44.2% ఓట్లతో 39,95,425 ఓట్లు నమోదయ్యాయి. ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా రాష్ట్రాలు ట్రంప్ ఖాతాలో చేరాయి.