
India Slams Canada: దౌత్యవేత్తల ఉపసంహరణపై కెనడా కారణాలను తప్పుబట్టిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో సిక్కు వేర్పాటు వాద నాయకుడి హత్యతో భారత్, కెనడా మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయి. దీంతో తాజాగా 41 మంది కెనడా దౌత్యవేత్తలు భారతదేశం విడిచి వెళ్లిపోయారు.
దౌత్యసిబ్బందిని కెనడా ఉపసంహరించుకోకపోతే వారి రక్షణను తొలగిస్తామని రెండు వారాల కిందటే భారత్ హెచ్చరికలు జారీ చేసింది.అయితే ఈ హెచ్చరికలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని కెనడా అంటోంది.
సమానత్వం అమలును అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరించే ఏ ప్రయత్నాన్నైనా తాము తిరస్కరిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
పరస్పర దౌత్యపరమైన ఉనికిలో సమానత్వం కోరుతూ భారతదేశంలో అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని కేంద్రం వివరణ ఇచ్చింది.
అయితే 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఉదయం ప్రకటించారు .
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కెనడా కారణాలను తప్పుబట్టిన భారత్
India Slams Canada’s Causes For Diplomats’ Withdrawal https://t.co/lXVMAMIpgx pic.twitter.com/gzWbBZrxAq
— ShTimes Social (@shtimes_social) October 20, 2023