Page Loader
Iran-Israel: 'మాతో యుద్ధానికి రావొద్దు'.. ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ అధ్యక్షుడి హెచ్చరిక
'మాతో యుద్ధానికి రావొద్దు'.. ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ అధ్యక్షుడి హెచ్చరిక

Iran-Israel: 'మాతో యుద్ధానికి రావొద్దు'.. ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ అధ్యక్షుడి హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మంగళవారం భారీ క్షిపణుల దాడులు జరిపింది. దాదాపు 200 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ ఈ దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసినా, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఇజ్రాయెల్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌ యుద్ధానికి ఆరాటపడే దేశం కాదని, తమ దేశం ప్రజల రక్షణలో భాగంగానే ఈ దాడులు జరిగాయని నెతన్యాహుకు తెలియజేయాలని, ఇరాన్‌తో ఘర్షణలకు దిగొద్దంటూ మసూద్‌ పెజెష్కియాన్‌ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇజ్రాయెల్‌ మరింత ప్రతీకార చర్యలకు పాల్పడకపోతే తమ దాడులు ముగిసినట్లేనని, కానీ ఇజ్రాయెల్‌ తిరిగి దాడులు చేస్తే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాక్చి హెచ్చరించారు.

Details

ఇజ్రాయెల్‌ ప్రయోజనాలను కాపాడేందుకు వెనక్కి తగ్గం : జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరాన్‌ దాడులను తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు అసమర్థమైనవని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా యూఎస్‌ ఇజ్రాయెల్‌ ప్రయోజనాలను కాపాడేందుకు వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. ఇరాన్‌ క్షిపణి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం బుధవారం తెలిపింది. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్‌పై మరింత శక్తివంతమైన చర్యలు చేపడతామని రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి స్పష్టం చేశారు.