తదుపరి వార్తా కథనం
Trump Buys Tesla car: టెస్లా కారును కొనుగోలు చేసిన ట్రంప్.. ఇచ్చిన మాట ప్రకారం కారు కొన్న అమెరికా అధ్యక్షుడు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 12, 2025
08:51 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వ్యాప్తంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ శాఖ నిర్ణయాల కారణంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో, మస్క్‌కు చెందిన టెస్లా కార్లను బహిష్కరించాలని పెద్దఎత్తున డిమాండ్లు పెరుగుతున్నాయి.
అయితే, ఈ పరిణామాల మధ్య ప్రపంచ కుబేరుడికి మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్వయంగా టెస్లా కారును కొనుగోలు చేస్తానని ప్రకటించారు.
తన మాటకు కట్టుబడి, తాజాగా ఆయన ఆ విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేశారు.
ఆసక్తికరంగా, ఈ సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏకంగా ఐదు టెస్లా కార్లను వైట్‌హౌస్‌కు తీసుకువచ్చారు. వాటిలో ఎరుపు రంగు కారును ట్రంప్ ఎంపిక చేసి కొనుగోలు చేశారు.