
Donald Trump:"భారత్‌లో ఎవర్నో గెలిపించేందుకు బైడెన్ ప్రయత్నం": ట్రంప్ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా డోజ్ విభాగం ఇటీవల భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కేటాయించిన 21మిలియన్ డాలర్ల నిధిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయాన్ని మళ్లీ సమర్థించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..గత జో బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
భారత ఎన్నికల్లో జోక్యం చేసేందుకు వారు ప్రయత్నించారంటూ పరోక్షంగా ఆరోపించారు.
మియామీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న ట్రంప్ ఈ నిధుల అంశాన్ని ప్రస్తావించారు.
''భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు మనం ఎందుకు 21మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలి?
బహుశా ఆ దేశంలో మరెవరినో గెలిపించేందుకు వారు(బైడెన్ ప్రభుత్వం)ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పక తెలియజేయాలి.అదే ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుంది'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాట్లాడుతున్న ట్రంప్
#WATCH | Miami, Florida | Addressing the FII PRIORITY Summit, US President Donald Trump says, "... Why do we need to spend $21 million on voter turnout in India? I guess they were trying to get somebody else elected. We have got to tell the Indian Government... This is a total… pic.twitter.com/oxmk6268oW
— ANI (@ANI) February 20, 2025