Page Loader
Donald Trump: బరాక్ ఒబామా అరెస్టు.. AI వీడియోను పోస్ట్ చేసిన డోనాల్డ్ ట్రంప్ 
బరాక్ ఒబామా అరెస్టు.. AI వీడియోను పోస్ట్ చేసిన డోనాల్డ్ ట్రంప్

Donald Trump: బరాక్ ఒబామా అరెస్టు.. AI వీడియోను పోస్ట్ చేసిన డోనాల్డ్ ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ పార్టీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను లక్ష్యంగా చేసుకుని ఓ వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశారు. ఒవల్ ఆఫీసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు ఒబామాను అరెస్ట్ చేస్తున్నట్లుగా కృత్రిమ మేథసహాయంతో (ఏఐ) రూపొందించిన ఆ వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. 'చట్టానికి ఎవరూ అతీతులు కారని' సందేశాన్ని అందిస్తూ ట్రంప్ ఈ వీడియో ద్వారా ఒబామాపై విమర్శలు చేయడం గమనార్హం.

వివరాలు 

మాజీ అధ్యక్షుడి చేతికి సంకెళ్లు

ఆ వీడియోలో తొలుత ఒబామా మాట్లాడుతూ "చట్టానికి అధ్యక్షుడు అతీతుడే" అన్నట్లుగా ఉంటుంది. ఆ తర్వాత పలువురు రాజకీయ నాయకులు "చట్టానికి ఎవ్వరూ మించి లేరు" అనే మాటలు చెప్పినట్లుగా చూపించారు. చివర్లో ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో ఒబామా సంభాషిస్తున్న సమయంలో ఎఫ్‌బీఐ అధికారులు అక్కడికి చేరుకుని ఒబామా చేతికి హ్యాండ్కఫ్స్ వేస్తున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. ఆ సమయంలో ట్రంప్ చిరునవ్వుతో నిలబడిన దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. అనంతరం ఒబామా ఖైదీ దుస్తుల్లో జైలు గదిలో కూర్చుని ఉన్న దృశ్యంతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియోను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేయగానే అది ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

వివరాలు 

ఒబామా హయాంలో పనిచేసిన వారందరినీ విచారణ చేయాలి: తులసి 

ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా పెద్ద స్థాయిలో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ట్రంప్, ఒబామాపై మోసం ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఇంతకుముందు, గత వారం యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన పాలనను నియంత్రించేందుకు ఒబామా అనుచరులు అసత్య ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు. రష్యా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలు అసత్యమని, వీటికి తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తులసీ స్పష్టం చేశారు. ఒబామా హయాంలో పనిచేసిన వారందరినీ విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..