తదుపరి వార్తా కథనం

Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 09, 2025
11:31 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ భారత్‌పై వరుసగా రెండో రోజు డ్రోన్ దాడులు నిర్వహించింది.
ఈ దాడులు సరిహద్దుల్లోని 20 నగరాలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వాటన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకుంది.
అంతేగాక, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు
. ఆయన విన్నపం మేరకు, వైట్ హౌజ్ ఒక ప్రకటన జారీ చేసింది. వీటిని సాధ్యమైనంత త్వరగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు.