Page Loader
'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్
'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్

'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్

వ్రాసిన వారు Stalin
Mar 04, 2023
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో మద్దతు పలికారు. ఈ మేరకు నిరసనకారులకు సపోర్టు చేస్తూ ట్రంప్ 'జస్టిస్ ఫర్ ఆల్' అనే పాటను పాడటం గమనార్హం. నాటి అల్లర్లలో పాల్గొని జైలుశిక్ష అనభవిస్తున్న ఖైదీల కుటుంబాల కోసం నిధులను సేకరించేందుకు ట్రంప్ ఈ పాటను రూపొందించారు. ప్రస్తుతం ఈ పాట స్పాటిఫై, ఆపిల్, మ్యూజిక్, యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. దీంతో ట్రంప్‌ ఓ పాటను స్వరపర్చిన ఘనతను సొంతం చేసుకున్నారు.

అమెరికా

గాయపడిన పోలీసులు ట్రంప్‌పై దావా వేసే అవకాశం

ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ట్రంప్ తన భాగాన్ని రికార్డ్ చేశారు. ఖైదీలు జైలు ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఈ పాట చివర్లో ఖైదీలు 'యూఎస్ఏ' అని అనడంతో గీతం ముగుస్తుంది. ట్రంప్ స్వరపర్చిన ఈ పాట విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమెరికా క్యాపిటల్‌లో జరిగిన అల్లర్లలో గాయపడిన పోలీసులు, ఇతరులు డొనాల్డ్ ట్రంప్‌పై దావా వేయవచ్చని న్యాయ శాఖ గురువారం తెలిపింది. డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌ను వీడటానికి రెండు వారాల ముందు క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగింది.