Page Loader
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా రామస్వామి సరైనోడు 
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా రామస్వామి సరైనోడు

డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా రామస్వామి సరైనోడు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 31, 2023
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ట్రంప్ ఆయన చాలా తెలివైనోడు అంటూ కీర్తించారు. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న వివేక్‌ రామస్వామిని ట్రంప్‌ మెచ్చుకున్నారు. ఆయన ఎంతో చురుగ్గా ఉంటారన్నారు. మీరు రామస్వామిని ఉపాధ్యక్ష అభ్యర్థిగా పరిగణించారా అని అడగ్గా, ఆయన అందుకు తగిన వ్యక్తేనన్నారు. మరోవైపు అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ దూసుకెళ్తున్నారు. అందరికంటే ఆయనే ముందున్నట్లు సర్వేలు పేర్కొన్నాయి. ఇటీవలే పార్టీ సదస్సులో రామస్వామి వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఒకవేళ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైతే, తాను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండేందుకు రామస్వామి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసల జల్లు