LOADING...
Dubai Princess: ఇన్‌స్టా పోస్ట్‌లో భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి.. ర్యాపర్‌తో నిశ్చితార్థం 
ఇన్‌స్టా పోస్ట్‌లో భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి.. ర్యాపర్‌తో నిశ్చితార్థం

Dubai Princess: ఇన్‌స్టా పోస్ట్‌లో భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి.. ర్యాపర్‌తో నిశ్చితార్థం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్ యువరాణి షేకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ గతేడాది తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ ర్యాపర్‌ ఫ్రెంచ్ మోంటానాతో (French Montana) ఆమె నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ ర్యాపర్ అధికార ప్రతినిధి ధృవీకరించినట్లు ఒక అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ వెల్లడించింది. ఇటీవలి కాలంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వివిధ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. విడాకులు ప్రకటించిన కొద్దికాలానికే షేకా మహ్రా,ఫ్రెంచ్ మోంటానా కలిసి దుబాయ్ వీధుల్లో దర్శనమిచ్చారు. అంతేకాదు,ఈ సంవత్సరం జూన్‌లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కూడా వీరు దుబాయ్‌ వీధుల్లో కన్పించారు.

వివరాలు 

UAE ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షేకా మహ్రా

ఆ సమయంలోనే వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 31 ఏళ్ల షేకా మహ్రా,దుబాయ్ పాలకుడు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె,అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు.మహిళా సాధికారత కోసం కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో 2023 మే 27న వివాహం జరిగింది. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి అనంతరం బిడ్డకు జన్మనిచ్చిన కొంతకాలానికే ఆమె భర్త నుంచి విడిపోయారు.

వివరాలు 

 ఇన్‌స్టాగ్రామ్‌లో "I Divorce You" అంటూ విడాకుల ప్రకటన 

ఆ సమయంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో "I Divorce You" అంటూ విడాకులు ప్రకటించి సంచలనంగా మారారు. అనంతరం 'Divorce' అనే పేరుతో పర్‌ఫ్యూమ్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు. మరోవైపు, మొరాకో వంశానికి చెందిన అమెరికన్ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్నారు. 'Unforgettable', 'No Stylist' వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. గతంలో ఆయన వ్యాపారవేత్త నదీన్‌ను వివాహం చేసుకున్నారు, కానీ తర్వాత ఆ బంధం కూడా విడాకులతో ముగిసింది. మొదటి భార్యతో ఆయనకు ప్రస్తుతం 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.