Page Loader
గల్ఫ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియాలో భారీగా కంపించిన భూమి..రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు 
రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు

గల్ఫ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియాలో భారీగా కంపించిన భూమి..రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 19, 2023
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికో దేశంలోని గల్ఫ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియాలో భారీగా భూమి కంపించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం మేరకు) స్యాన్‌ జోస్‌ డెల్‌ కాబో సమీపంలో భూకంపం వచ్చినట్లు యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని వివరించింది. స్యాన్‌ జోస్‌ డెల్‌ కాబోకు 118 కిలోమీటర్ల దూరంలో భూకంపానికి గురైన ప్రాంతం ఉందని పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు జరిగినట్లు స్పష్టం చేసింది. ఏదైనా ఒక ప్రాంతంలో భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.5గా రికార్డ్ అయితే దాని వల్ల ఆస్తి , ప్రాణనష్టం సంభవించేందుకే ఎక్కువ అవకాశాలుంటాయని సైంటిఫిక్ లెక్కల చెబుతున్నాయి.

DETAILS

ఓడరేవుల్లో అలలు భారీగా ఎగిసిపడే ముప్పు పొంచి ఉంది :  అధికారులు

గల్ఫ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా భూకంప ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ, ఎలాంటి అపాయం జరగలేదని అక్కడి అధికారులు చెప్పారు. భూకంపం తీవ్రత వల్ల తీర ప్రాంతాల్లోని ఓడరేవుల్లో అలలు భారీగా ఎగిసిపడే ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. భూకంపం ధాటికి సముద్ర నీటి మట్టాల్లో చిన్నపాటి వ్యత్యాసాలను గుర్తించడానికి వీలుందని మెక్సికో సివిల్‌ డిఫెన్స్‌ ఆఫీస్‌ తెలిపింది. అయితే సునామీ మాత్రం వచ్చే అవకాశమే లేదని యూఎస్‌ సునామీ హెచ్చరికల కేంద్రం తేల్చి చెప్పింది. మరోవైపు భూకంప తీవ్రత 6.3గా నమోదైందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్‌ సర్వేలో వెల్లడైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భూకంపాన్ని నిర్థారించిన సెసిమిక్ డేటా ( సిస్మో గ్రాఫ్ )