Srilanka Earthquake: శ్రీలంకలోని కొలంబోలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
శ్రీలంక రాజధాని కొలంబోలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. భూకంపం కారణంగా భయంలో జనం పరుగులు తీశారు. కాగా ఈ భూకంపంపై ఆ దేశ అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.
ప్రాణనష్టం వాటిల్లలేదన్న జియోలాజికల్ సర్వే మైన్స్
శ్రీలంకకు ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలోని హిందూ మహాసముద్రంలో 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. సోమవారం నాడు దక్షిణ సూడాన్, ఉగాండా సరిహద్దు చుట్టూ ప్రాంతాల్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం కారణంగా శ్రీలంకకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని జియోలాజికల్ సర్వే మైన్స్ బ్యూరో స్పష్టం చేసింది.