Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం
ఈ వార్తాకథనం ఏంటి
సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కల్లోలం సృష్టించింది. ఈ విప్తత్తుకు ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోకు తీవ్ర విషాదాన్ని మిగల్చింది.
కూలిన భవనాల శిథిలాలను తొలగించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగిస్తున్నా కొద్ది మృతదేహాలు బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలో భూకంపం కారణంగా మరణించిన వారి సఖ్య 2,000వేలకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 2,059 మంది గాయపడ్డారని, శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నారని, వారిని రక్షించే ప్రయత్నంలో ఉన్నట్లు యంత్రాంగం తెలిపింది.
అయితే మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఆరు దశాబ్దాల్లోనే అత్యంత ఘోరమైన భూకంపం ఇదని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది.
భూకంపం
శత్రుత్వాన్ని వీడి పొరుగు దేశానికి అల్జీరియా సాయం
భూకంపం మారుమూల పర్వత గ్రామాల్లో తీవ్రమైన ప్రభావం చూపింది. దీంతో సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కష్టకాలంలో ఉన్న పొరుగుదేశాన్ని ఆదుకునేందుకు అల్జీరియా సైతం చేయి కలిపింది. వాస్తవానికి మొరాకో- అల్జీరియా దేశాల మధ్య కొన్నేళ్లుగా వైరం నడుస్తోంది. అయినా విబేధాలను పక్కన పెట్టి ఆపద సమయంలో తమ దాయాది దేశానికి సాయ చేసేందుకు ముందుకొచ్చింది.
విబేధాల కారణంగా ఇన్నాళ్లు మొరాకో విమానాలపై ఆంక్షలు విధించిన అల్జీరియా ప్రస్తుతం గగనతలాన్ని తెరవడానికి ఓకే చెప్పింది.
కొన్నేళ్ల క్రితం మొరాకో నుంచి అల్జీరియా దేశం విడిపోయినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది.
భూకంపం
మేమున్నామని ప్రపంచ దేశాల భరోసా
మొరాకోలోని అమెరికన్ పౌరుల పరిస్థితిపై మొరాకోతో సంప్రదింపులు జరుపుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
మొరాకో ప్రజలకు అవసరమైన సహాయం అందించడానికి యుఎస్ సిద్ధంగా ఉందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా భూకంపం ప్రమాదంపై తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మొరాకోకు అన్ని విధాలా సాయం అందిస్తామని స్పష్టం చేశారు. మొరాకోకు సహాయం అందించిన ఇతర దేశాల్లో టర్కీ, ఖతార్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, ఖతార్, దుబాయ్, జోర్డాన్ ఉన్నాయి.
ఫ్రాన్స్‌కు చెందిన ఆరెంజ్ అనే మొబైల్ సంస్థ భారీ భూకంపం తర్వాత మొరాకోకు ఒక వారం పాటు ఉచిత కాల్‌లను అందిస్తోంది.