Pakistan: పాకిస్థాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 2.57 గంటల సమయంలో భూకంపం వచ్చింది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం..రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైంది.
ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
అయితే ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Details
జనవరిలో 4.3 తీవ్రతతో భూకంపం
గత నెలలో 4.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పాకిస్థాన్‌ను కుదిపేసింది. జనవరిలో,రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం పాకిస్థాన్‌ను తాకింది.
పాకిస్తాన్ వాతావరణ శాఖ(పిఎమ్‌డి)ప్రకారం,జనవరిలో మాత్రమే,మరో 6.0-తీవ్రతతో కూడిన భూకంపం పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను కదిలించింది.
ఇస్లామాబాద్,లాహోర్, దాని పరిసర ప్రాంతాలు,ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని నివేదిక పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్థాన్‌లో 5.5 తీవ్రతతో భూకంపం
#Earthquake of 5.5 magnitude jolts #Pakistanhttps://t.co/PHJiHuAuPi pic.twitter.com/3mhM3V2Xri
— Hindustan Times (@htTweets) March 20, 2024