Page Loader
Elon Musk: భారత్‌, చైనాలో జనాభా క్షీణతపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర పోస్ట్‌ 
భారత్‌, చైనాలో జనాభా క్షీణతపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర పోస్ట్‌

Elon Musk: భారత్‌, చైనాలో జనాభా క్షీణతపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర పోస్ట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా తగ్గుదలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా పేర్కొన్నారు. టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ అనే గ్రూప్ తమ 'ఎక్స్' ఖాతాలో జనాభా క్షీణత గురించి ఒక గ్రాఫ్‌ను పంచుకుంది. ఇందులో నైజీరియా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్థాన్, భారత్, చైనా వంటి కీలక దేశాల్లో 2018 నుంచి 2100 వరకు జనాభాలో జరిగే మార్పుల వివరాలను చూపించారు. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్ దేశాల్లో 2100 నాటికి జనాభా క్షీణత తీవ్రంగా ఉంటుందని ఆ గ్రాఫ్‌లో అంచనా వేశారు.

వివరాలు 

చర్చా గ్రాఫ్ నెట్టింట్లో వైరల్‌

ఈ గ్రాఫ్‌ను పంచుకుంటూ, టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ "జనాభా తగ్గుదల మానవాళికి అత్యంత పెద్ద ముప్పు" అని పేర్కొంది. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ "అవును" అని రాశారు. ఆ గ్రాఫ్‌ను రీపోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ చర్చా గ్రాఫ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.