NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Elon Musk: రీఫామ్‌ యూకే పార్టీకి టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భారీ షాక్‌ 
    తదుపరి వార్తా కథనం
    Elon Musk: రీఫామ్‌ యూకే పార్టీకి టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భారీ షాక్‌ 
    రీఫామ్‌ యూకే పార్టీకి టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భారీ షాక్‌

    Elon Musk: రీఫామ్‌ యూకే పార్టీకి టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భారీ షాక్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 06, 2025
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిటన్ (UK)లోని రీఫామ్ యూకే పార్టీకి టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్, గట్టి షాక్ ఇచ్చారు.

    ఈ సందర్భంగా, మస్క్ తమ పార్టీకి భారీగా విరాళం ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆ పార్టీ నేత నైజెల్ ఫరేజ్ ముందుగా ప్రకటించారు.

    అయితే, తాజాగా మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, రీఫామ్ యూకే పార్టీకి కొత్త నాయకుడు అవసరమని, ఫరేజ్‌కు ఆ పార్టీని నడిపించగల సామర్థ్యం లేదని అభిప్రాయపడ్డారు.

    అందువల్ల, ఫరేజ్ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు.

    అంతేకాకుండా, జైలులో ఉన్న బ్రిటిష్ ఆందోళనకారుడు టామీ రాబిన్సన్‌కు మస్క్ మద్దతు తెలుపుతున్నట్టు ఆ పోస్ట్‌లో పేర్కొనడం ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం.

    వివరాలు 

    మస్క్ అభిప్రాయంతో ఏకీభవించలేదు: నైజెల్ ఫరేజ్

    ఈ పోస్టుతో ఆశ్చర్యపోయిన నైజెల్ ఫరేజ్, మస్క్ అభిప్రాయంతో తాను ఏకీభవించలేదని చెప్పారు.

    మస్క్ తనకు సహాయం చేయాలనుకుంటున్నారని కానీ, టామీ రాబిన్సన్‌కు మద్దతు ఇవ్వడం సరైన చర్య కాదని చెప్పారు.

    మస్క్ రీఫామ్ యూకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు వీలయితే 100 మిలియన్ డాలర్ల వరకు విరాళం ఇవ్వగలడని ఫరేజ్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

    దీనిపై మస్క్ తన హామీని కట్టుబడిగా ఇచ్చారు. అలాగే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇతర రిపబ్లికన్ నేతలతో సత్సంబంధాలు పెంచుకొని, యూకే-యూఎస్ సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడగలమని కూడా పేర్కొన్నారు.

    అయితే, మస్క్ తన మద్దతును బ్రిటన్‌లోని రాజకీయ పార్టీలకు ఇచ్చే క్రమంలో, అదే సమయంలో బ్రిటన్ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు.

    వివరాలు 

    బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌పై మస్క్ సంచలన ఆరోపణలు

    "గ్రూమింగ్ గ్యాంగ్"ల విషయంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు.

    2013లో పాకిస్థాన్ మూలాలైన ఒక వ్యక్తి ఓల్డ్ హోమ్‌లో లైంగిక వేధింపులు చేసే గ్యాంగ్‌లను నడిపినప్పుడు ఆ సమయంలో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్‌గా ఉన్న కీర్ స్టార్మర్ ఈ అంశాన్ని పట్టించుకోలేదని మస్క్ ఆరోపించారు.

    బ్రిటన్‌లో జరిగిన ఘోరమైన నేరాలలో ఆయన కూడా భాగస్వామ్యంగా ఉన్నారని ఆయన నమ్మకంగా చెప్పారు.

    దీనిపై జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని మస్క్ డిమాండ్ చేశారు.అయితే,UK ఆరోగ్యశాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ ఈ ఆరోపణలు అసంబద్ధమైనవని ఖండించారు.

    మస్క్ చేసే అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పారు.ఈ సమస్యను పరిష్కరించడానికి వారు మస్క్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలాన్ మస్క్

    తాజా

    #NewsBytesExplainer: అత్యాధునిక టెక్నాలజీతో కొత్త భారతీయ పాస్‌పోర్ట్.. నకిలీ పాస్‌పోర్టులకు చెక్ పాస్ పోర్ట్
    Virushka: బృందావనాన్ని సందర్శించిన కోహ్లి దంపతులు.. అనుష్క శర్మ-కోహ్లి జంటను ఆశీర్వదించిన ప్రేమానంద్ జీ విరాట్ కోహ్లీ
    Sitaare Zameen Par: ఆమిర్‌ఖాన్ 'సితారే జమీన్ పర్‌' ట్రైల‌ర్ ఈరోజు రాత్రి విడుదల బాలీవుడ్
    CBSE Class 10 results: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ

    ఎలాన్ మస్క్

    Elon Musk: భారీగా పతనమైన ఎలాన్ మస్క్, ఎక్స్ విలువ.. $24బిలియన్ల నష్టం  ఎక్స్
    Space-X 2 సంవత్సరాలలో అంగారక గ్రహానికి మొదటి మానవరహిత స్టార్‌షిప్‌ను పంపుతుంది - ఎలోన్ మస్క్  అంతరిక్షం
    X: ఎక్స్ లో కొత్త ఫీచర్.. వినియోగదారులు DMలను మాత్రమే బ్లాక్ చేయగలరు ఎక్స్
    Trump Assassination Bid:ట్రంప్‌‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు.. బయటికొచ్చిన దృశ్యాలు  డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025