Los Angeles Wildfires: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. 30వేల మందిని తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
లాస్ ఏంజిల్స్‌లో అగ్నిప్రమాదం తీవ్రంగా మారింది. గంటల్లోనే మంటలు శరవేగంగా విస్తరించాయి.
వేల ఎకరాల అడవులు కాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
కొన్ని గంటల వ్యవధిలో 10 ఎకరాల నుండి 3,000 ఎకరాల వరకు మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.
సుమారు 30వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అగ్నిమాపక సిబ్బంది సూచించారు. 13,000 గృహాలు ప్రమాదంలో ఉన్నాయని అగ్నిమాపక అధికారులు చెప్పారు.
హాలీవుడ్ నటులు నివసించే ప్రాంతాలను కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం లాస్ ఏంజిల్స్‌లో అగ్నిప్రమాదం మొదలైంది.
Details
మంటలను అపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
తీవ్ర గాలుల కారణంగా అడవి మంటలు వేగంగా వ్యాపించాయి.
కాలిఫోర్నియాలో లక్షలాది మంది వార్నింగ్ జోన్‌లో ఉన్నారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర పోరాటం చేస్తున్నారు.
పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో 12 చదరపు కిలోమీటర్ల అడవి కాలిపోయింది. ఈ ప్రాంతం శాంతి మోనికా, మాలిబు పట్టణాల మధ్య ఉంది. శక్తివంతమైన గాలులు మంటలను మరింత విస్తరించాయి.
లాస్ ఏంజిల్స్ కౌంటీలో 46వేల ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆల్టడేనా ప్రాంతంలో 200 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి.
సెలబ్రిటీలు అయిన యూజీన్ లెవి, జేమ్స్ వుడ్స్ తమ ఇళ్లను వదిలి వెళ్లారు.