Page Loader
ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అరుదైన గౌరవం.. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్​ హానర్ తో సత్కారం
మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత గౌరవం.. ఓ ప్రధానికి పురస్కారం దక్కడం ఇదే తొలిసారి

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అరుదైన గౌరవం.. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్​ హానర్ తో సత్కారం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 14, 2023
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫ్రెంచ్ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది. ఈమేరకు మోదీకి 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్​ హానర్'​ను ఆతిథ్య దేశ అధ్యక్షుడు మాక్రాన్ అందించారు​. ఎలిసీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో మోదీకి ఈ గౌరవాన్ని అందజేశారు. ఫ్రెంచ్ పౌర,మిలిటరీ పురస్కారాల్లో గ్రాండ్ క్రాస్ అత్యుత్తమైందిగా గుర్తింపు పొందింది. ఓ దేశ ప్రధానికి ఈ పురస్కారం దక్కడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా నెల్సన్‌ మండేలా, కింగ్‌ చార్లెస్‌, జర్మనీ మాజీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌, యూఎన్ఓ మాజీ కార్యదర్శి బుట్రోస్‌ ఘాలీలు గతంలో ఈ పురస్కారం అందుకున్నారు. భారతీయుల తరఫున మాక్రాన్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీకి అత్యున్నత పౌర, మిలిటరీ పురస్కారం అందజేత