Modi-Trump: అక్రమ వలసదారులను వెనక్కి తీసుకురావడానికి సిద్ధం: అమెరికాలో మోదీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక చర్చలు నిర్వహించారు.
అనంతరం వీరిద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా అక్రమ వలసదారుల సమస్యపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తామని ప్రకటించారు.
ఒక దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని,ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఇటీవల అమెరికా ప్రభుత్వం 104మంది భారతీయులను దేశం నుంచి తిరిగి పంపిన సంగతి తెలిసిందే.
అయితే,అప్పటి పరిస్థితుల్లో వీరి చేతులకు సంకెళ్లు,కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది.
ఈపరిణామాల నేపథ్యంలో ట్రంప్‌తో భేటీ అయిన మోదీ వలసదారుల సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు.
వివరాలు
వలసదారుల సమస్యపై మోదీ వ్యాఖ్యలు
''యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా అక్రమ వలసదారులుగా మారుతున్నారు. కొందరు డబ్బు, ఉద్యోగాల ఆశ చూపించి వీరిని మోసం చేస్తున్నారు. తెలియకుండానే వారు మానవ అక్రమ రవాణా సమస్యలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి దారుణాలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో భారత్‌కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను'' అని మోదీ అన్నారు.
వివరాలు
మిమ్మల్ని చాలా మిస్సయ్యా: మోదీతో ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీతో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి.
వాషింగ్టన్‌లోని వెస్ట్ వింగ్ లాబీకి చేరుకున్న మోదీకి ట్రంప్ సాదర స్వాగతం పలికారు.
ఇరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ట్రంప్, "మిమ్మల్నిచాలా మిస్సయ్యా" అని ట్రంప్‌తో మోదీ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా మోదీ "నాక్కూడా మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది" అని తెలిపారు.