
Nuclear Deal: ఇరాన్ అణుఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. చర్చలు విఫలమైతే భయంకర పరిణామాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో అణుఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టెహ్రాన్‌తో శనివారం జరుగనున్న ఉన్నత స్థాయి చర్చలను ఆయన వెల్లడించారు.
ఈ చర్చలు ఫలించకపోతే ఇరాన్ తీవ్రమైన ప్రమాదంలో పడతుందని గట్టిగా హెచ్చరించారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"శనివారం ఇరాన్‌తో ఉన్నతస్థాయి సమావేశం జరగబోతోంది.అణుఒప్పందంపై నేరుగా చర్చలు కొనసాగుతున్నాయి.ఒక ఒప్పందం సాధ్యపడే అవకాశం ఉంది.అది ఒక గొప్ప ఒప్పందం అవుతుంది. కానీ ఇరాన్ ఈ దౌత్యపరమైన చర్చలకు అంగీకరించకపోతే, వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు.అక్కడ పెద్ద స్థాయిలో బాంబు దాడులు జరిగే అవకాశం ఉంది. ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదు" అని ట్రంప్ స్పష్టం చేశారు.
వివరాలు
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తక్షణమే స్పందించింది. అమెరికాతో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతాయని పేర్కొంటూనే, అవి పరోక్షంగా జరుగుతాయని వివరించింది.
ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ 'ఎక్స్'లో పోస్ట్ చేయడం ద్వారా తెలిపారు. ఆయన ప్రకారం, అమెరికాతో ఈ పరోక్ష చర్చలు శనివారం ఒమన్‌లో నిర్వహించనున్నారు.
ట్రంప్ అధ్యక్ష పదవిలో తొలిసారి ఉన్నప్పుడు,ఇరాన్‌తో సంబంధాలు అంతగా అభివృద్ధి చెందలేదు.
2018లో ఆయన హయాంలోనే అమెరికా అణుఒప్పందం నుంచి వైదొలిగింది.దీంతో టెహ్రాన్‌పై ఆంక్షలు విధించాయి.
అప్పటి నుంచి జరిగిన పరోక్ష చర్చలు పెద్దగా ఫలించలేదు.తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ మరోసారి చర్చలకు సానుకూలంగా స్పందించారు.
"ఇరాన్‌ను నాశనం చేయాలనే ఉద్దేశం నాకు లేదు,అందుకే అణుఒప్పందంపై చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నాను"అని పేర్కొన్నారు.
వివరాలు
బాంబు దాడులు తప్పవు
అయితే ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిరాకరణ తెలిపారు.
పరోక్ష మార్గంలో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
టెహ్రాన్ అణుఒప్పందానికి తిరస్కరిస్తే, బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు.
ఇలాంటి దాడులు ఇరాన్ ఎప్పుడూ చూడనివిధంగా ఉంటాయని తెలిపారు.
ఈ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తీవ్రంగా స్పందించారు.
అమెరికా దాడులకు పాల్పడితే తమ దేశం బలమైన ప్రతిస్పందన ఇస్తుందని, వెనకడుగేయమని స్పష్టంగా హెచ్చరించారు.