
భారతీయులకు మరో గుడ్ న్యూస్.. రెండింతలు పెరగనున్న అమెరికా హెచ్-1బీ వీసాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ అందించనుంది. హెచ్-1బీ వీసాలను రెండు రెట్లుకు పెంచాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ్యులు బిల్లును సైతం ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం సంవత్సరానికి దాదాపు 65 వేల వీసాలను జారీ చేస్తోంది అమెరికా ప్రభుత్వం. అయితే తాజాగా దాన్ని ఏకంగా 1.30 లక్షలకు పెంచాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన డెమొక్రటిక్ మెంబర్ రాజా కృష్ణమూర్తి గత శుక్రవారం సదరు బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టారు.
బిల్లు ఆమోదం తర్వాత భారతీయులకు భారీ స్థాయిలో ప్రయోజనం అందనుంది.
ఈ స్థాయిలో హెచ్1 బీ వీసాల పెరుగుదలతో నేరుగా అమెరికాలోని సంస్థలకు లాభం జరుగుతుందని కృష్ణమూర్తి వివరించారు. అయితే ఈ చట్టాన్ని 'హైర్ యాక్ట్'గా ఆయన అభివర్ణించడం విశేషం.
DETAILS
అత్యుత్తమ ప్రతిభతో టెక్నాలజీ రంగంలో అమెరికా ముందంజ
ఫలితంగా అమెరికా కంపెనీలకు మానవవనరులు సులువుగా దొరికేందుకు వీలవుతుందని డెమొక్రటిక్ మెంబర్ రాజా కృష్ణమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను సొంతం చేసుకోవడం ద్వారా టెక్నాలజీ రంగంలో అమెరికా ముందు వరుసలో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అందుకే వీసాలను సంఖ్యను 65 వేల నుంచి 1.30 లక్షలకు పెంచుతున్నామన్నారు. మరోవైపు హైర్ చట్టం కోసం బిల్లును ప్రవేశపెట్టడంపై కృష్ణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. సదరు బిల్లును ప్రవేశపెట్టడం గర్వంగా ఉందన్నారు.
స్టెమ్ - సైన్స్,టెక్, ఇంజినీరింగ్, మ్యాథ్స్ స్ట్రీమ్‌లకు నిధులు అందించడంతో నైపుణ్యం కలిగిన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమెరికాలో కార్మికుల కొరత లేకుండా ఉండేందుకు ఈ చట్టం కృషిచేస్తుందన్నారు.