తదుపరి వార్తా కథనం
Gurpatwant Singh Pannun: గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులు.. ఆస్ట్రేలియా టుడే ఎడిటర్ సంచలన ఆరోపణలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 09, 2024
01:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా మీడియా సంస్థ 'ఆస్ట్రేలియా టుడే' తమపై వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులు చేసిందని పేర్కొంది.
ఆ సంస్థ ఎడిటర్ జితార్థ్ జై భరద్వాజ్ వెల్లడించిన ప్రకారం యూఎస్, కెనడాలో పన్నూను కవర్ చేసినందుకు తమ ఫొటోలు ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు అతడి మద్దతుదారులు తమకు హాని తలపెట్టాలంటూ పన్నూ ప్రేరేపించాడని ఆరోపించారు.
జైశంకర్ ప్రెస్‌మీట్ కవర్ చేసిన తర్వాత 'ఆస్ట్రేలియా టుడే' సోషల్ మీడియా పేజీలను కెనడాలో నిలిపివేయడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది.
Details
ముఖ్యమైన కథనాలను అందించడమే లక్ష్యం
కెనడా చేసిన ఈ చర్యపై 'ఆస్ట్రేలియా టుడే' ఎడిటర్ స్పందించారు.
తమ కవర్‌జ్‌లో పారదర్శకత, కచ్చితత్వానికి కట్టుబడి ఉంటామన్నారు.
ప్రజలకు ముఖ్యమైన కథనాలను అందించడమే తమ లక్ష్యమని, తమకు లభిస్తున్న మద్దతు స్వేచ్ఛాయుత మీడియా ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నారు.