Page Loader
Canada: కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడి ఇంటిపై కాల్పులు 
Canada: కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడి ఇంటిపై కాల్పులు

Canada: కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడి ఇంటిపై కాల్పులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 02, 2024
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌ సౌత్ సర్రేలోని ఓ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాత్రిపూట కాల్పులు జరిపారు. ఆ ఇల్లు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడికి చెందినదని కెనడా CBC న్యూస్ శుక్రవారం నివేదించింది. CBC న్యూస్ ప్రకారం, 154వ వీధిలోని 2,800 బ్లాక్‌కి సమీపంలో ఉన్న ఒక ఇంటిలో గురువారం తెల్లవారుజామున 1:20 (స్థానిక కాలమానం) తర్వాత తుపాకీ కాల్పుల నివేదికలపై స్పందించినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు. ఈ కాల్పులలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఇల్లు నిజ్జర్ స్నేహితుడు సిమ్రంజీత్ సింగ్‌కు చెందినది. గత ఏడాది జూన్‌లో నిజ్జర్ హత్య భారతదేశం,కెనడా మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీసింది.

Details 

భారత కాన్సులేట్ వద్ద సిమ్రంజీత్ సింగ్ ఖలిస్తాన్ అనుకూల నిరసన

ఆప్రాంతంలో కాల్పుల కారణంగా ఒక కారు భారీగా దెబ్బతింది. సిమ్రంజీత్ సింగ్ ఇంట్లో చాలా బుల్లెట్ రంధ్రాలు కనిపించాయని CBC న్యూస్ నివేదించింది. కార్పోరల్ సర్బ్‌జిత్ సంఘా ప్రకారం,కాల్పుల ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇరుగుపొరుగు వారితోనూ,ఆ ప్రాంతంలోని సాక్షులతోనూ మాట్లాడామని ఆయన చెప్పారు. అయితే,ఇంటిపై ఎన్ని కాల్పులు జరిగాయో సంఘా చెప్పలేదు.గాలిలోకి కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారని చెప్పారు. బ్రిటీష్ కొలంబియా గురుద్వారాస్ కౌన్సిల్ ప్రతినిధి మోనీందర్ సింగ్ మాట్లాడుతూ,నిజ్జర్‌తో సిమ్రంజీత్ సింగ్‌కు ఉన్న సంబంధం వల్ల కాల్పులు జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. జనవరి 26న వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ వద్ద సిమ్రంజీత్ సింగ్ ఖలిస్తాన్ అనుకూల నిరసనను నిర్వహించిన తర్వాత కాల్పులు జరిపారని ఆయన చెప్పారు.