NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కమలా హారిస్ 
    తదుపరి వార్తా కథనం
    Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కమలా హారిస్ 
    అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కమలా హారిస్

    Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కమలా హారిస్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 15, 2024
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రచారాల్లో దూకుడు పెంచారు.

    ఆమె తరచూ ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరించే విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

    ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న హారిస్, ట్రంప్‌పై కఠిన విమర్శలు చేశారు.

    "ట్రంప్‌ మాట మీద నిలబడే వ్యక్తి కాదని" వ్యాఖ్యానించారు. ట్రంప్‌ మద్దతు ఇవ్వని వారిని, తన విధానాలను అనుసరించకుండా ఎదురు తిరిగేవారిని దేశానికి శత్రువులుగా పరిగణిస్తారని ఆమె ఆరోపించారు. ఇది ఆయన మాటల్లోనే స్పష్టమవుతోందని హారిస్‌ పేర్కొన్నారు.

    వివరాలు 

    ట్రంప్‌ మళ్లీ అధికారంలోకి వస్తే అది అమెరికాకు ప్రమాదం

    ఎన్నికల రోజు ట్రంప్‌ మద్దతుదారులు చేసే పనులను చూసి ఆందోళన చెందనని ఆమె చెప్పింది.

    "ట్రంప్‌ చేసే పనులు ప్రజల స్వేచ్ఛను ప్రమాదంలో పడేస్తాయి" అని మండిపడ్డారు. "మనలోనే మనకు శత్రువులు ఉన్నారు, రాడికల్‌ లెఫ్ట్‌ భావజాలంతో కొందరు వెర్రితలలు వేస్తున్నారు" అని ఆమె ఆరోపించారు.

    ట్రంప్‌ మళ్లీ అధికారంలోకి వస్తే అది అమెరికాకు ప్రమాదం అవుతుందని హారిస్‌ అన్నారు.

    అధికారంలోకి వస్తే, ఆయన దేశ సమస్యలను కాకుండా, విద్యార్థులను, జర్నలిస్టులను, ఎన్నికల అధికారులను, న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుంటారని ఆమె తెలిపారు.

    ఈ క్రమంలో, తనపై రాజకీయ వ్యతిరేకత చూపుతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి నేషనల్ గార్డ్ లేదా యూఎస్ మిలిటరీని ఉపయోగించాలని ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు.

    వివరాలు 

    డొనాల్డ్‌ ట్రంప్‌పై కమలా హారిస్‌ విజయం

    ఇంకా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న సర్వేలు సూచించినట్లుగా, ట్రంప్‌తో పోలిస్తే అభ్యర్థి రేసులో కమలా హారిస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

    అంతేకాక, ఆమెకు ప్రచారాల కోసం భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

    అమెరికన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, రాజకీయ శాస్త్రవేత్త అలన్‌ లిచ్‌మన్‌ ఒక ఇంటర్వ్యూలో, "అధికార ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌పై కమలా హారిస్‌ విజయం సాధిస్తారు" అని జోస్యం చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    కమలా హారిస్‌
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు
    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే! భారత జట్టు

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా
    'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి డొనాల్డ్ ట్రంప్
    స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి? డొనాల్డ్ ట్రంప్
    Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్

    కమలా హారిస్‌

    Kamala Harris: కొత్త  సర్వేల్లో ముందంజలో కమలా హ్యారీస్.. వెనుకబడ్డ ట్రంప్  డొనాల్డ్ ట్రంప్
    Kamala Harris: కమలా హారిస్  తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణం .. ఎక్కడంటే..?  అంతర్జాతీయం
    Biden: అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన కారణం తెలిపిన బైడెన్  జో బైడెన్
    Barack Obama: కమలా హారిస్‌కు మద్దతు పలికిన  ఒబామా దంపతులు  అంతర్జాతీయం

    డొనాల్డ్ ట్రంప్

    Capital Hill Case: డొనాల్డ్‌ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. విచారణల నుంచి మినహాయింపు  అమెరికా
    Donald Trump : మెటా ప్రకటన.. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం తొలగింపు అంతర్జాతీయం
    Donald Trump : ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు  అంతర్జాతీయం
    Trump Rally Shooting: అమెరికాలో హింసకు చోటు లేదు: బైడెన్   జో బైడెన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025