Page Loader
Elon Musk: కెనడాలో ఎన్నికల్లో ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఓడిపోతారు.. ఎలాన్‌ మస్క్‌ జోస్యం 
కెనడాలో ఎన్నికల్లో ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఓడిపోతారు

Elon Musk: కెనడాలో ఎన్నికల్లో ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఓడిపోతారు.. ఎలాన్‌ మస్క్‌ జోస్యం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడా పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడోపై బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో ఎలాన్ మస్క్ పాత్ర ఉండటం తెలిసిందే. ఈ నేపధ్యంలో కెనడాలోని ఓ యూజర్, ట్రూడోని వదిలించుకునేందుకు ఎలాన్ మస్క్ సాయం చేయాలని కోరాడు. దీనికి సమాధానంగా, మస్క్ "రాబోయే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారు" అని పేర్కొన్నారు.

వివరాలు 

కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల బహిష్కరణ 

కెనడా పార్లమెంట్‌లో మొత్తం 338 స్థానాలు ఉండగా, ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి 153 మంది సభ్యులు ఉన్నారు. ఈ మైనారిటీ ప్రభుత్వాన్ని మిత్రపక్షాల మద్దతుతో నడిపించుకుంటూ వచ్చారు. కానీ, ట్రూడో నాయకత్వంపై వారి స్వంత పార్టీ నుండే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులు కలిగించవచ్చని భావిస్తున్నారు. ఇక, భారత్-కెనడా సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత తీవ్రమయ్యాయి. దీనితో, భారత ప్రభుత్వం తమ దౌత్యవేత్తలను వెనక్కు పిలుచుకోవడమే కాకుండా, దిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించిన విషయం తెలిసిందే.