Hezbollah: హిజ్బుల్లా మీడియా చీఫ్ మహ్మద్ అఫీఫ్ హతం.. ధృవీకరించిన హిజ్బుల్లా
ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాకు చెందిన మరో కీలక నేతను హతమార్చింది. లెబనాన్ రాజధాని బేరూట్‌పై ఐఎడీఎఫ్(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్)చేసిన వైమానిక దాడిలో హెజ్‌బొల్లా మీడియా విభాగానికి ప్రతినిధి మహమ్మద్ అఫీఫ్ మరణించాడు. ఈ సమాచారాన్ని "టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్" వార్తా సంస్థ వెల్లడించింది, అనంతరం హెజ్‌బొల్లా కూడా దీనిని ధృవీకరించింది. సెంట్రల్ బిరుట్‌లోని సిరియన్ బాత్ పార్టీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత అఫీఫ్ మరణించినట్లు తెలుస్తోంది. సెంట్రల్ బిరుట్‌పై ఇజ్రాయెల్ సేనల దాడి చేయడం ఇది మొదటిసారి. ఈ పరిణామాల నేపథ్యంలో, హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చే ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో,మహమ్మద్ అఫీఫ్ బాహ్య ప్రపంచంలో ఎక్కువగా ఉండేవారు. ఈ విషయాన్ని గమనించిన ఇజ్రాయెల్ అతన్ని లక్ష్యంగా తీసుకుంది.
దాడుల్లో 12 మంది మృతి..
ఇక, హిజ్బుల్లా మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బిరుట్ దక్షిణ శివార ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో టార్గెట్ చేసింది. ఈ దాడులు, లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణపై చర్చించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో జరిగినవిగా సమాచారం. మరో వైపు, గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు అని పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు.