Loading...
Trump: పుతిన్‌తో చర్చలు జరపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్‌ కీలక సూచన
పుతిన్‌తో చర్చలు జరపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్‌ కీలక సూచన

Trump: పుతిన్‌తో చర్చలు జరపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్‌ కీలక సూచన

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణలు ఇటీవలి కాలంలో మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడి త్వరలోనే ఓ ఒప్పందానికి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జెలెన్‌స్కీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్, జెలెన్‌స్కీ ఇన్నేళ్లుగా సర్దుకుపోతూ వస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే వారిద్దరూ ఓ ఒప్పందానికి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. శీతాకాలానికి ముందే ఈ అంశంపై ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. యుద్ధాన్ని ముగించాలని జెలెన్‌స్కీ బలంగా కోరుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు.

వివరాలు

రష్యాకు వచ్చే ఆదాయాన్ని నిలిపివేయాలి

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా యుద్ధంపై స్పందించారు.

తమ దేశంపై రష్యా దురాక్రమణను అంతం చేసేందుకు వైట్‌హౌస్ సాయం చేస్తోందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

ఆంక్షలు, వాణిజ్య పరిమితుల ద్వారా రష్యాకు వచ్చే ఆదాయాన్ని నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు.

తద్వారా యుద్ధాన్ని కొనసాగించేందుకు మాస్కోకు అవసరమైన ఆర్థిక వనరులు అందకుండా చేయాలని కోరారు.

వివరాలు

ఆగని రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు

యుద్ధానికి ముగింపు పలికేందుకు ఒకవైపు చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు కీవ్, మాస్కో మధ్య పరస్పర దాడులు మాత్రం ఆగడం లేదు.

శనివారం రాత్రి ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు చేసింది. ఈ దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

రష్యా దాడుల కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

కీవ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు, స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ల కోసం పనిచేసే ఓ డేటా సెంటర్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టింది.

ఈ దాడుల కారణంగా ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

పరిస్థితి తీవ్రతరం

ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు మరణించగా.. పలువురు గాయపడ్డారు.

ఒకవైపు యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు, ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ..

మరోవైపు రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ADVERTISEMENT