Page Loader
Donald Trump: 'కమలా హారిస్ కంటే నేనే బాగుంటా'.. వ్యక్తిగత విమర్శలు చేసిన ట్రంప్
'కమలా హారిస్ కంటే నేనే బాగుంటా'.. వ్యక్తిగత విమర్శలు చేసిన ట్రంప్

Donald Trump: 'కమలా హారిస్ కంటే నేనే బాగుంటా'.. వ్యక్తిగత విమర్శలు చేసిన ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు జోరందుకుంటున్నాయి. అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డొమోక్రటిక్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. అమె నవ్వు భయకరంగా ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యనించాడు. అంతేకాకుండా ఆమె కంటే తానే చూడటానికి మంచిగా కనిపిస్తున్నానని పేర్కొన్నారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Details

అమెరికా కలలను జో బైడెన్-హారిస్ చంపేశారు

కమలా హారిస్ నవ్వడంపై నిషేధం ఉందని, దీంతో ఆమె నోరు మూసుకొని తిరుగుతోందని, ఆమె నవ్వాలని కోరుకుంటున్నానని వెటకారంగా ట్రంప్ పేర్కొన్నారు. ఇక టైమ్ మ్యాగజైన్ వద్ద కమలా హారిస్ ఫోటోలే లేవని, వారి కళాకారులు మాత్రం ఆమె డ్రాయింగ్ వేస్తారని వివరించారు. అమెరికా కలలను జో బైడెన్-హారిస్ చంపేశారని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.