ICE Deported Record: అమెరికాలో రికార్డు స్థాయిలో వలసదారుల బహిష్కరణలు.. ఏడాదిలో 4.83 లక్షల మందిని పంపేసిన వైనం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి మరోసారి వెలుగులోకి వచ్చింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) ఏజెన్సీ భారీ సంఖ్యలో వలసదారులను అరెస్టు చేయడంతో పాటు దేశం నుంచి బహిష్కరించింది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారిక గణాంకాలను విడుదల చేసింది. హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,83,200 మంది వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించారు. ICE ఏజెన్సీ 23 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక సంఖ్య. గత ఏడాది నమోదైన 4,42,640 మంది బహిష్కరణల రికార్డును తాజా గణాంకాలు అధిగమించాయి.
వివరాలు
కఠిన వలస విధానాలతో రికార్డు స్థాయిలో అరెస్టులు.. ముల్లిన్ వెల్లడి
మరోవైపు, అరెస్టుల సంఖ్య కూడా రికార్డు స్థాయికి చేరింది. ఈ ఏడాది మొత్తం 4,91,000 మందికి పైగా అరెస్టయ్యారు.
వీరిలో సుమారు 4,75,000 మంది అడ్మినిస్ట్రేటివ్ అరెస్టులకు గురయ్యారు. ముఖ్యంగా 2026 ఆగస్టులో 50,925 మందిని అరెస్టు చేయగా, సెప్టెంబర్లో ఈ సంఖ్య 48,000 దాటింది.
ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన వలస విధానాల వల్లే ఇంత భారీ స్థాయిలో అరెస్టులు, బహిష్కరణలు సాధ్యమయ్యాయని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్వేన్ ముల్లిన్ తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో వరుసగా మూడు పూర్తి ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన మొత్తం అరెస్టులు, బహిష్కరణల సంఖ్య కంటే ప్రస్తుత ఏడాది గణాంకాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
వలస విధానాలపై డెమొక్రాట్ల సమీక్ష.. గణాంకాలపై సందేహాలు
ఈ గణాంకాలు విడుదల కావడానికి కొద్ది రోజుల ముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వలస విధానాలు కొంత కఠినంగా ఉండవచ్చని అంగీకరించారు.
అయితే, చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిని దేశం నుంచి పంపించేందుకు చేపడుతున్న చర్యలను ఆయన సమర్థించుకున్నారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న డెమొక్రాట్లు ఈ పరిణామాలపై దృష్టి సారించారు.
వివరాలు
వలస విధానాలపై డెమొక్రాట్ల సమీక్ష.. గణాంకాలపై సందేహాలు
ICE ఏజెన్సీ అనుసరిస్తున్న విధానాలు, కఠిన నిబంధనలపై సమీక్ష చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంకేతాలిచ్చారు.
అయితే, తాజాగా విడుదలైన గణాంకాల్లో అమెరికా సరిహద్దుల వద్ద పట్టుబడిన వలసదారులు, దేశ అంతర్గత ప్రాంతాల్లో అరెస్టయిన వారి వివరాలను విడివిడిగా చూపించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో వలసదారులపై ప్రభుత్వం చేపట్టిన చర్యల పూర్తి స్థాయి, వాటి స్వరూపంపై స్పష్టత కొరవడిందని వారు పేర్కొంటున్నారు.