Page Loader
Donald Trump: ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నిత్యం కేసుల చుట్టూ తిరిగేవాడిని : డొనాల్డ్ ట్రంప్
ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నిత్యం కేసుల చుట్టూ తిరిగేవాడిని : డొనాల్డ్ ట్రంప్

Donald Trump: ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నిత్యం కేసుల చుట్టూ తిరిగేవాడిని : డొనాల్డ్ ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తన పరిస్థితి దుర్భరంగా మారిపోయేదని చెప్పారు. గత సర్కారు తనకు చుక్కలు చూపించిందని, ఎన్నికల్లో ఓటమి ఎదురైన ఉంటే కోర్టులు, కేసుల మధ్య నలిగిపోయేవాడినని వెల్లడించారు. మియామీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, తన రాజకీయ జీవితం, ఎదురైన సవాళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ దూకుడుగా పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారులను ప్రత్యేక సైనిక విమానాల ద్వారా వారి స్వదేశాలకు పంపిస్తున్నారు.

Details

ఓటమిపై షాకింగ్ కామెంట్స్

దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైనా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతేకాదు అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ తన పాలన కొనసాగిస్తున్నారు. ట్రంప్ గతంలో పనామా కాలువను అమెరికా ఆధీనంలోకి తీసుకోవాలని, గ్రీన్‌లాండ్ దీవిని కొనుగోలు చేయాలని, కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చాలని సూచించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ విధంగా ఎన్నో సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తూనే, అనేక మందిని భయభ్రాంతులకు గురిచేసిన ట్రంప్, ఇప్పుడు తన ఓటమి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

Details

గత ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది

ఈ ఎన్నికల్లో ఓడిపోతే తన పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తనతో అన్యాయంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవకపోయి ఉంటే, తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయేది, నిత్యం కోర్టు కేసుల మధ్య పడిపోయేవాడినని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తు అనుమానాస్పదంగా మారి ఉండేదని అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నడూ వెనుకడుగు వేయని ట్రంప్ కూడా ఓటమిపై భయపడతారా? అంటూ నెటిజన్లు విస్తుపోతున్నారు.