
IMF: పాకిస్థాన్‌కు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని సమర్థించుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి
ఈ వార్తాకథనం ఏంటి
భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి దాదాపు బిలియన్ డాలర్లు (రూ. 8,540 కోట్లు)విలువైన ఉద్దీపన నిధులను ఆ దేశానికి అందించేందుకు ఆమోదం తెలిపింది.
ఈనిధులు విడుదలకు ముందు అవసరమైన అన్ని ఆర్థిక లక్ష్యాలను పాకిస్థాన్ చేరుకున్నట్లు IMF స్పష్టంగా ప్రకటించింది.
ఈనిధులను ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఇక ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'వల్ల పాకిస్థాన్ అంతర్గతంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న తరుణంలో ప్రపంచ బ్యాంక్ నుంచి మరో కీలక ఊరట లభించింది.
ఈఒత్తిడిని తేలిక పరచేందుకు ప్రపంచ బ్యాంక్ రెండు బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ మంజూరు చేయడానికి అంగీకరించింది.
వివరాలు
బిలియన్ డాలర్ల నిధుల మంజూరు
ఇక ఈ పరిణామాలపై భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయాన్ని అందించడం తప్పు అని భారత ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
పాకిస్థాన్ తన భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఆశ్రయంగా మార్చిందని, అందువల్ల ఆ దేశానికి ఇచ్చే ఆర్థిక సహాయమన్నది పరోక్షంగా ఉగ్రవాదానికి నిధులు అందజేసినట్లేనని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల హెచ్చరించారు.
అయినప్పటికీ IMF తన నిర్ణయంలో మార్పు చేయలేదు. తాజా విడతగా 1 బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేసింది.
ఇది పాకిస్థాన్ కోసం గత ఏడాది కుదిరిన 7 బిలియన్ డాలర్ల ఈఎఫ్ఎఫ్ ఒప్పందంలో భాగమే.
ఇప్పటివరకు ఈ ఒప్పందం కింద రెండు విడతల్లో కలిపి 2.1 బిలియన్ డాలర్లు అందించింది.
వివరాలు
పాకిస్థాన్ ఆర్థిక సహాయం వినియోగించే విధానంపై విమర్శలు
ఇదిలా ఉండగా, IMF నిధులు విడుదల సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరో కీలక ప్రకటన చేశారు.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి పరిహారం అందిస్తామన్నారు.
భారత్ చేసిన వైమానిక దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఒక్కొక్కరి కుటుంబానికి రూ. 1 కోట్ల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
అంటే మొత్తం రూ. 14 కోట్లు మసూద్ కుటుంబానికి చెల్లించే అవకాశముందని తెలుస్తోంది.
అంతేకాక, ఆ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా షరీఫ్ తెలిపారు.
ఈ ప్రకటనల నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్థిక సహాయం వినియోగించే విధానంపై విమర్శలు మరింత ఊపందుకున్నాయి.