
Trump tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. భారత్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో రికార్డ్ వృద్ధి!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అస్తిర టారిఫ్‌ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో దీని ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. ట్రంప్ పదవిలో 100 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ ప్రభావం గణాంకాల్లో కూడా ప్రతిఫలిస్తోంది.
భారత ప్రభుత్వం ఏప్రిల్ 28న విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మార్చి 2025లో దేశీయంగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
గత నెల 11.2 శాతంగా ఉన్న వృద్ధిరేటు, మార్చిలో 21.5 శాతానికి చేరింది. ఇది 33 నెలల గరిష్ఠ స్థాయిగా నమోదైంది.
Details
భారత్ నుంచి అమెరికాకు భారీగా ఎగుమతులు
అమెరికా టారిఫ్‌ల పెరుగుదల వల్ల ముందస్తుగా గూడ్స్‌ను షిప్ చేయాలనే ఉద్దేశంతో భారత్ నుంచి అమెరికాకు భారీగా ఎగుమతులు జరిగినట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా టారిఫ్‌లు ఎప్పుడైనా పెరిగే అవకాశాల నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, ఆటో పార్ట్స్, ఎలక్ట్రికల్స్ రంగాల్లో వినియోగదారుల నుంచి అత్యధిక ఆర్డర్లకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఉదాహరణకు, యాపిల్ సంస్థ మార్చిలో ఐదు విమానాల్లో ఐఫోన్స్‌ను అమెరికాకు ఎగుమతి చేసిందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థలో అసోసియేట్ డైరెక్టర్ పారస్ జస్రాయ్ తెలిపారు.
ఇలాంటి ఆర్డర్ల వల్లే భారత్‌లో ఎలక్ట్రానిక్స్ రంగం మళ్లీ వేగంగా ఊపందుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.