Page Loader
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చట్టవిరుద్ధం.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చట్టవిరుద్ధం.. ఇద్దరికీ ఏడేళ్ల జైలు శిక్ష

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చట్టవిరుద్ధం.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

వ్రాసిన వారు Stalin
Feb 03, 2024
07:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల కష్టాలు ఇప్పడు తీరేలా కనిపంచడం లేదు. ఇంకో వారంలో పాకిస్థాన్‌లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇమ్రాన్‌కు మరో కేసులో జైలు శిక్ష పడింది. ఇస్లామేతర నిఖా (ఇద్దత్ కేసు) కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ట్రయల్ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వారిద్దరికీ కోర్టు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ కేసు విచారణ ఒకరోజు క్రితం వరకు జరిగింది. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి ఖుదర్తుల్లా ఈరోజు తీర్పును వెలువరించారు.

పాకిస్థాన్

ఆగస్టు నుంచి జైల్లోనే ఇమ్రాన్ 

ఇమ్రాన్ ఖాన్‌పై బుష్రా బీబీ మాజీ భర్త ఖవార్ మనేకా ఈ కేసును దాఖలు చేశారు. తన భార్య బుష్రా బీబీ, ఇమ్రాన్ ఖాన్ ఇస్లామేతర, చట్టవిరుద్ధమైన వివాహం చేసుకున్నారని ఖవార్ మనేకా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతేడాది ఆగస్టు నుంచి జైలులోనే ఉన్నారు. రహస్య పత్రాలను బహిర్గతం కేసులో 10ఏళ్లు, తోషాఖాన్ కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష ఇమ్రాన్‌కు పడింది. ఈ క్రమంలో అతని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌ను కూడా ఎన్నకల సంఘం రద్దు చేసింది. అంతేకాకుండా, ఆయన పార్టీ నాయకుల నామినేషన్ పత్రాలు తిరస్కరించబడ్డాయి.