LOADING...
పాకిస్థాన్: పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ హతం  
పాకిస్థాన్: పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ హతం

పాకిస్థాన్: పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ హతం  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2023
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి,భారత్‌ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్‌ను బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 41 ఏళ్ల లతీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జేఎం) సభ్యుడు. జనవరి 2, 2016న జరిగిన పటాన్‌కోట్ దాడికి ప్రధాన కుట్రదారు. లతీఫ్ సియాల్‌కోట్ నుండి దాడిని సమన్వయం చేయడమే గాక దానిని అమలు చేయడానికి నలుగురు జెఎమ్ ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌కు పంపాడు. లతీఫ్ చట్టవిరుద్ధమైన కార్యకలపాలను నిర్వహించడమే కాకుండా UAPA కింద ఉగ్రవాద ఆరోపణలపై నవంబర్ 1994లో భారతదేశం అతనిని అరెస్టు చేసింది.

Details 

విమానాన్ని హైజాక్ చేసిన కేసులో లతీఫ్‌పై ఆరోపణలు

భారతదేశంలో శిక్ష అనుభవించిన తరువాత, అతను 2010లో బహిష్కరించబడ్డాడు.అటు తరువాత వాఘా మీదుగా పాకిస్తాన్‌కు అతను వెళ్ళిపోయాడు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన కేసులో కూడా లతీఫ్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2010లో విడుదలైన తర్వాత లతీఫ్ పాకిస్థాన్‌లోని జిహాదీ ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తులో తేలింది. అతడిని భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టుగా పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ హతం