Page Loader
Donald Trump: మోసం కేసులో ట్రంప్‌కు 364 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన కోర్టు 
Donald Trump: మోసం కేసులో ట్రంప్‌కు 364 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన కోర్టు

Donald Trump: మోసం కేసులో ట్రంప్‌కు 364 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన కోర్టు 

వ్రాసిన వారు Stalin
Feb 17, 2024
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. మరో కేసులో ట్రంప్ దోషిగా తేలడంతో న్యూయార్క్ కోర్టు ట్రంప్‌కు భారీ జరిమానా విధించింది. 355 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేల కోట్లు) జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ట్రంప్‌తో పాటు ఆయన కుమారులకు కూడా శిక్ష విధించడంతో పాటు వారికి కూడా జరిమానా విధించింది. అలాగే న్యూయార్క్‌లోని ఓ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేయకుండా మూడేళ్ల పాటు ట్రంప్‌పై కోర్టు నిషేధం విధించింది. ఆయన కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్స్, ఎరిక్ ట్రంప్‌లకు కోర్టు నాలుగు మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ట్రంప్ కుమారులిద్దరూ న్యూయార్క్ కంపెనీలో డైరెక్టర్లుగా పని చేయకుండా ఆంక్షలు విధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రంప్ కుమారులకు కూడా జరిమానా