
Donald Trump: రష్యా,భారత్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వారు ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా మాకు సంబంధం లేదు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం నుంచి జరిగే దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తున్నదే ఇందుకు ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. తాజాగా మరోసారి రష్యా,భారత్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్రూత్ సోషల్ అనే తన సోషల్‌మీడియా వేదికలో ట్రంప్ ఓ పోస్టు చేశారు. అందులో రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఆ చర్యలతోనే వారు తమ ఆర్థిక వ్యవస్థను మరింత పతనమవుతున్న దిశగా నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే న్యూఢిల్లీతో అమెరికా చాలా తక్కువ స్థాయిలో వాణిజ్యం చేస్తోందని వెల్లడించారు.
వివరాలు
మద్వెదేవ్ ప్రవర్తన చాలా ప్రమాదకరం
ఇందుకు ప్రధాన కారణం భారత్ అధిక స్థాయిలో దిగుమతులపై సుంకాలు విధిస్తోంది అని ఆయన ఆరోపణ. ఈ సందర్భంలో ట్రంప్ మరో కీలక వ్యాఖ్య చేశారు. రష్యా, అమెరికా మధ్య ప్రస్తుతం ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అనంతరం రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మద్వెదేవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మద్వెదేవ్ ప్రవర్తన చాలా ప్రమాదకరంగా మారిందని ఆయన హెచ్చరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రంప్ చేసిన ట్వీట్
BREAKING 🚨 At 12:00 AM President Trump has a message for India and Russia: “They can take their de@d economies down together for all I care” 🔥
— MAGA Voice (@MAGAVoice) July 31, 2025
Donald Trump NEVER stops working for America
HOLD THE LINE pic.twitter.com/V50h5N0c86