
భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ కీలక వ్యాఖ్యలు..5 ట్రిలియన్ డాలర్లుగా ఎదుగుతుందని జోస్యం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.
త్వరలోనే 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్నట్లు స్పష్టం చేశారు. విప్లవాత్మకమైన సంస్కరణలతో భారత్‌లో సులభతర వ్యాపార సౌలభ్యాన్ని(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)ను మెరుగుపర్చామన్నారు.
2019 తర్వాత బ్రిక్స్ దేశాలు నిర్వహస్తున్న తొలి సదస్సులో పాల్గొనేందుకు మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉన్నా, భారత్ మాత్రం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
సమీప భవిష్యత్‌లో భారత్ ప్రపంచ వృద్ధి ఇంజిన్ గా మారుతుందన్నారు. భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతూ వ్యాపారవేత్తలను ఆహ్వానించారు.
details
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లోనూ ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలున్నట్లు చెప్పారు. లాజిస్టిక్స్ రంగంలో ఖర్చులు తగ్గడంతో తయారీ రంగంలో పోటీ ఏర్పడిందన్నారు.
డిజిటల్ చెల్లింపుల్లోనూ భారత పురోగతిని మోదీ ప్రస్తావించారు. బ్రిక్స్ కోసం యూపీఐ చెల్లింపు విధానాలను ఉపయోగించేందుకు చాలా అవకాశాలున్నట్లు చెప్పారు.
సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తూ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు వివరించారు.
మరోవైపు జీఎస్టీ, వస్తు,సేవల పన్ను అమలుతో పెట్టుబడిదారులకు విశ్వాసం పెరిగిందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలని, భారతీయులు ప్రతిజ్ఞ పూనారని ప్రధాని స్పష్టం చేశారు.
బ్రిక్స్ దేశాలు- బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు సంయుక్తంగా ప్రపంచ సంక్షేమానికి దోహదం చేస్తాయన్నారు.
embed
దక్షిణాఫ్రికాలో మోదీ ప్రసంగం
Sharing my remarks at the BRICS Business Forum in Johannesburg. https://t.co/oooxofDvrv— Narendra Modi (@narendramodi) August 22, 2023 Sharing my remarks at the BRICS Business Forum in Johannesburg. https://t.co/oooxofDvrv— Narendra Modi (@narendramodi) August 22, 2023