LOADING...
Viral video:నేలపై పడేసి.. చేతులను వెనక్కి విరిచిపెట్టి.. భారతీయుడిపై అమెరికా అధికారుల కాఠిన్యం
నేలపై పడేసి.. చేతులను వెనక్కి విరిచిపెట్టి.. భారతీయుడిపై అమెరికా అధికారుల కాఠిన్యం

Viral video:నేలపై పడేసి.. చేతులను వెనక్కి విరిచిపెట్టి.. భారతీయుడిపై అమెరికా అధికారుల కాఠిన్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన నెవార్క్‌ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత దేశానికి చెందిన ఒక యువకుడిని అక్కడి భద్రతా సిబ్బంది నేలపై పడేసి, అతని చేతులను వెనక్కి వంచి గట్టిగా కట్టేశారు. అనంతరం అతడిని భారతదేశానికి తిరిగి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను 'ఎక్స్‌' మాధ్యమంలో కునాల్‌ జైన్‌ అనే సామాజిక వ్యాపారవేత్త (సోషల్ ఆంత్రప్రెన్యూర్) పంచుకున్నారు. ఆయన భారత ఎంబసీతో పాటు, భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ ఘటనపై స్పందించిన న్యూయార్క్‌లోని భారత రాయబారి కార్యాలయం (కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా),తమకు ఈ ఘటనపై సమాచారం అందిందని,ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

వివరాలు 

జైశంకర్‌ జోక్యం చేసుకోవాలి 

అలాగే, అక్కడి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వెల్లడించింది. కునాల్‌ జైన్‌ జూన్ 8న ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన వివరాల ప్రకారం.. "ఒక యువ భారతీయుడు (అతడు విద్యార్థి కావొచ్చని అనుకుంటున్నాను)నిన్న రాత్రి భారతదేశానికి తిరిగి పంపారు. అతడి చేతులకు బేడీలు వేసి, భద్రతాధికారులు నేలపై పడేసి చేతులను వెనక్కి వంచారు. అతడు ఏడుస్తున్నాడు. ఒక ప్రవాస భారతీయుడిగా నేనిది చూశాక ఎంతో నిస్సహాయతను అనుభవించాను. నా గుండె పగిలిపోయింది. ఇది నిజమైన మానవతా సంక్షోభం" అని ఆయన వ్రాశారు. బాధితుడు హర్యానాకు చెందినవాడై ఉండొచ్చని,ఎందుకంటే అతడు హరియాణ్వీ భాషలో మాట్లాడుతున్నాడని కునాల్‌ వెల్లడించారు. ఈఘటనపై భారతీయ రాయబార కార్యాలయంతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

వివరాలు 

వీడియోపై వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్న భారత కాన్సులేట్‌

ప్రస్తుతం ఈ విద్యార్థిని అమానుషంగా బంధించిన ఘటనపై సోషల్ మీడియా ల్లో వైరలవుతున్న వీడియోపై వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ (సీజీఐ) వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కునాల్‌ జైన్‌ చేసిన ట్వీట్