Palestine: పాలస్తీనాను దేశంగా గుర్తించిన ఐర్లాండ్, నార్వే, స్పెయిన్.. రాయబారులను వెనక్కి పిలిపించిన ఇజ్రాయెల్
పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఎనిమిది నెలలుగా యుద్ధం జరుగుతోంది. ఇప్పట్లో రెండు దేశాల మధ్య వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా ఐర్లాండ్, నార్వే,స్పెయిన్ దేశాలు పాలిస్తీనాను అధికారికంగా ఒక దేశంగా గుర్తించాయి. ఈ నిర్ణయంపై ఇజ్రాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యూదుల రాష్ట్రమైన ఇజ్రాయెల్ తక్షణమే అమలులోకి వచ్చేలా ఐర్లాండ్, నార్వేల్లోని తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. బుధవారం,ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ,నేను ఐర్లాండ్, నార్వేలకు స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నాను. ఇజ్రాయెల్ తన సార్వభౌమత్వాన్ని బలహీనపరిచే, దాని భద్రతకు అపాయం కలిగించే వారి పట్ల మౌనంగా ఉండదు'' అని అన్నారు.
పాలస్తీనాను రాష్ట్రంగా గుర్తిస్తుంది: పెడ్రో శాంచెజ్
మే 28 నుండి తమ దేశం కూడా పాలస్తీనాను రాష్ట్రంగా గుర్తిస్తుందని స్పానిష్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం ప్రకటనలో తెలిపారు.అయితే దీనిపై స్పెయిన్‌కి ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చింది. ఐరిష్-నార్వేజియన్ మూర్ఖత్వం మమ్మల్ని ఆపలేవు. మా లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్నాం. మన పౌరులకు భద్రతను పునరుద్ధరించడం, హమాస్‌ను నిర్మూలించడం, బందీలను స్వదేశానికి తీసుకురావడం మా లక్ష్యాలుగా ఉన్నాయి.ఇంతకు మించి ణ్యమైన కారణాలు లేవు అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ అన్నారు. గాజాలో యుద్ధం కొనసాగుతున్న వేళ ఈ తాజా పరిణామం వెలుగులోకి వచ్చింది.హమాస్ ఆక్రమించిన ప్రాంతాలలో యుద్ధం మానవతా వినాశనానికి కారణమైంది. వేలాది మంది మరణించగా,మరికొందరు గాయపడ్డారు.లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి, ఆకలితో అలమటిస్తున్నారు.
ఈ రోజు స్పెయిన్,ఐర్లాండ్, నార్వేలో ఏమి జరిగింది?
స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఈరోజు పార్లమెంట్‌లో ప్రసంగించారు. మెజారిటీ స్పెయిన్ ప్రజలను పరిగణనలోకి తీసుకుంటే,వచ్చే మంగళవారం(మే 28)స్పానిష్ మంత్రుల మండలి పాలస్తీనాను రాష్ట్రంగా గుర్తించడాన్ని ఆమోదిస్తుందని ఆయన చెప్పారు. ఇదిలావుండగా,ఇజ్రాయెల్,పాలస్తీనా,వారి ప్రజల మధ్య శాంతి, భద్రతకు రెండు రాష్ట్రాల పరిష్కారమే ఏకైక విశ్వసనీయ మార్గమని ఐరిష్ ప్రధాని సైమన్ హారిస్ బుధవారం అన్నారు. ఈ రోజు ఐర్లాండ్ పాలస్తీనాను ఒక రాష్ట్రంగా గుర్తించిందని ఆయన అన్నారు. ఈ గుర్తింపు మధ్యప్రాచ్యంలో శాంతి, సయోధ్యకు దోహదపడుతుందని తాము నమ్ముతున్నామన్నారు. నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోరే ప్రకటన కూడా వచ్చింది. ఇజ్రాయెల్‌తో శాంతి నెలకొల్పేందుకు ఇది దోహదపడుతుందనే ఆశతో తమ దేశం స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని గుర్తిస్తుందని ఆయన అన్నారు.