Israel-Hamas: గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 130 మందికి పైగా మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. గాజాపై టెల్‌అవీవ్ వైమానిక దాడులు చేపట్టింది.
ఈ దాడుల్లో 130 మందికి పైగా మరణించినట్లు సమాచారం. సంధి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్, ఐఎస్‌ఏ దాడులు నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
అనంతరం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ తిరస్కరించినందునే ఈ దాడులకు ఆదేశించినట్లు తెలిపారు.
వివరాలు
హమాస్ కీలక ప్రకటన
'మా బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ నిరాకరిస్తూనే ఉంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దాడులు చేపట్టింది. యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం' అని నెతన్యాహు ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఇకపై హమాస్‌కు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హమాస్ హెచ్చరికలు
ఈ దాడులు కొనసాగుతున్న తరుణంలో హమాస్ కీలక ప్రకటన చేసింది.
తాజా దాడుల కారణంగా ఇజ్రాయెల్ తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, దీంతో బందీల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని హమాస్ ఆరోపించింది.
ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది.
వివరాలు
ల్పుల విరమణ చర్చలు ప్రారంభించాలన్న హమాస్
దీని ప్రకారం, హమాస్ దాదాపు 30 మంది బందీలను విడుదల చేయగా, ప్రతిగా ఇజ్రాయెల్ 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.
ఈ క్రమంలో రెండో దశ కాల్పుల విరమణపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే, అవి అవ్వలేదు.
రంజాన్ సందర్భంగా, తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు పొడిగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించారు.
దీనికి ఇజ్రాయెల్ అంగీకరించినప్పటికీ, హమాస్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, హమాస్‌పై ఒత్తిడి పెంచేందుకు నెతన్యాహు చర్యలు చేపట్టారు.
అందులో భాగంగా, గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని నిలిపివేసి, విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు.
మరోవైపు , హమాస్ మాత్రం కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించాలని కోరుతోంది.