
ఇజ్రాయెల్-హమాస్ భీకర పోరులో 2800 మంది దుర్మరణం.. గాజాపై కురిసిన 6 వేల బాంబులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర దాడి నేపథ్యంలో ఇరు పక్షాల్లో భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. అక్టోబర్ 6న హమాస్ అటాక్ తో మొదలైన దాడులు, శుక్రవారం ఏడో రోజుకు చేరుకున్నాయి.
హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్‌లో ఇప్పటికే 1,300 మంది మరణించారు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రతిదాడిలో గాజాలో సుమారు 1,500 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణం విడిచారు.దీంతో ఇరువైపులా 2,800 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
దాడుల్లో 27 మంది అమెరికన్లు తుదిశ్వాస విడిచారు. మరో 14 మంది జాడ మిస్ అయ్యింది. ఇప్పటికే తమ పౌరులను తరలించేందుకు భారత్ 'ఆపరేషన్ అజయ్'ను కొనసాగిస్తోంది.
యుద్ధం ప్రారంభం నాటి నుంచి గాజాపై దాదాపుగా 6 వేల బాంబులేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.
DETAILS
రోజు రోజుకు తీవ్రరూపందాలుస్తున్న యుద్ధం
ఇంకోవైపు యుద్ధం రోజు రోజుకు తీవ్రరూపందాలుస్తోంది. గాజాపై గ్రౌండ్ లెవెల్ లో ఆపరేషన్ చేసేందుకు ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది.
ఈ మేరకు గాజా స్ట్రిప్ సరిహద్దు వద్దకు మిలిటరీ ట్యాంకులు, ఇతర సైనిక ఆయుధాలను తరలిస్తోంది. యుద్ధ సమయం స్టార్ట్ అయ్యిందని ఇజ్రాయెల్ సైనికాధికారులు చెబుతుండటం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.
రెండు దేశాల మధ్య యుద్ధం మరింత ముదురుతున్న క్రమంలో, అమెరికా తన పౌరుల కోసం చార్టర్ విమానాలను పంపిస్తోంది.
యుద్ధం ఇదే రీతిలో కొనసాగితే ఇతర రూపాల్లో సమస్యలను సృష్టించే ప్రమాదం ఉందని ఇరాన్ హెచ్చరిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గాజా మీద బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరు పక్షాలు
⚡️Supposedly from the airstrikes on Gaza tonight pic.twitter.com/yk0WoyZT9A
— War Monitor (@WarMonitors) October 12, 2023