NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel-Hamas: ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Israel-Hamas: ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం
    ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం

    Israel-Hamas: ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 16, 2024
    06:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ లెబనాన్‌లోని ఖనా నగరంపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ దాడులు జరిపింది.

    ఈ ఘటనలో మేయర్ అహ్మద్ కహిల్ సహా 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ పేర్కొన్నారు.

    ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని పౌర నివాసాల మధ్య ఉన్న స్థావరాలను తీవ్రంగా టార్గెట్ చేసింది.

    లెబనాన్ సివిల్ డిఫెన్స్ తెలిపిన వివరాల ప్రకారం, కూలిన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికితీశారు.

    ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం, దక్షిణ లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల (యూనిఫిల్) పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 15 మంది ఐరాస సైనికులు గాయపడ్డారు.

    Details

    250మందికి పైగా హెజ్బొల్లా ఫైటర్లు మృతి

    ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఐరాస దళాలను ప్రమాదకర ప్రాంతాల నుంచి వెంటనే వైదొలగాలని కోరారు.

    ఇప్పటివరకు, దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భూతల దాడుల్లో 250 మందికి పైగా హెజ్‌బొల్లా ఫైటర్లు మరణించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

    అందులో 21 మంది కమాండర్లు ఉన్నారని పేర్కొంది. హెజ్‌బొల్లా తమ సైనిక సామర్థ్యాలను భారీగా కోల్పోయినా, ఇజ్రాయెల్‌పై దాడి చేసే సామర్థ్యాలు ఇంకా ఉన్నాయని ఐడీఎఫ్ తెలిపింది.

    ఇటీవల, హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌లోని బిన్యామినా ప్రాంతంలోని సైనిక స్థావరంపై భీకర డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందగా, 60 మందికి పైగా గాయాల పాలయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    లెబనాన్

    తాజా

    Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..! రక్షణ శాఖ మంత్రి
    IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ! ఐపీఎల్
    India-Pak War : ఈనెల 18 వరకు భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు ఆర్మీ
    Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు డొనాల్డ్ ట్రంప్

    ఇజ్రాయెల్

    Israel-Lebanon: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్..1000 రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసం  హిజ్బుల్లా
    United Nations: హెజ్‌బొల్లా దాడులపై యూఎన్‌ తీవ్ర ఆగ్రహం ఐక్యరాజ్య సమితి
    Explained: ఐరన్‌ డోమ్‌ ఎలా పనిచేస్తుంది.. సక్సెస్ రేటు ఎంత? ఐరన్‌ డోమ్‌
    Hezbollah Israel Tension: హిజ్బుల్లాపై ఐడీఎఫ్ 1500 కోట్ల రూపాయల విలువైన క్షిపణుల వర్షం హిజ్బుల్లా

    లెబనాన్

    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్‌కు లెబనాన్, సిరియా నుంచి మరో యుద్ధ ముప్పు.. సరిహద్దులో అలజడి  ఇజ్రాయెల్
    ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్  ఇజ్రాయెల్
    గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు  హమాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025